తక్కువ ధరలకే వాహనాలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సిక్కోలు ప్రజలకు సరికొత్త వాహనాలను తక్కువ ధరకే అందిస్తామని పద్మపూజిత ఆటో ఫైనాన్స్, వీల్మార్ట్ సంస్థ చైర్మన్ బసవ రాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలో పెద్దపా డు రోడ్డు, జీవన్ జ్యోతినగర్‌లో నూతన షోరూమ్‌ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తమ సంస్థకు టూ వీలర్ వెహికల్ ఫైనాన్స్, ఆటోమొబైల్ రంగంలో 22 ఏళ్ల విశిష్ట అనుభవం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలలో 135 పైగా బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. 600కు పైగా పలు రకాల వాహనాలు కస్టమర్లకు అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైన వారికి తక్షణం ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సాయి, రమేష్, శ్రీనివాస్, సతీష్ ప్రసాద్, సతీష్, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment