నగరం మెరిసేలా..
నభోమూర్తి మురిసేలా..
మిల్లు జంక్షన్‌లో
ఏర్పాటు చేసిన
సూర్యనమస్కారాల
విగ్రహాలు
అరసవల్లి: ప్రఖ్యాత అరసవల్లి ఆదిత్య క్షేత్రంలో రథ సప్తమి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రా రంభమయ్యాయి. మొదటి సారి మూడు రోజుల పాటు వేడుక నిర్వహిస్తుండడంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం సామూహిక సూర్యనమస్కారాల ప్రక్రియను స్థానిక 80 ఫీట్ రోడ్డులో ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీవో సాయి ప్రత్యూష తదితర అధికారులంతా కలిసి యోగాసనాలను వేశారు. దాదాపు 3వేల మంది 12రకాల ఆసనాలు వేశారు. యోగా గురువు రామారావు ఆధ్వర్యంలో వివిధ యోగా నిర్వాహక సంస్థలు, పతంజలి యో గా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సూర్య ప్రణవ పతంజలి యోగ, ఓం శాంతి, ఎన్జీవో తదితర సంస్థల సభ్యులు, జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు తదితర శాఖాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రమంత్రి వస్తున్నారని తెలిసి
సామూహిక సూర్య నమస్కారాలు జరుగుతుండగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌లు రావడంతో.. కలెక్టర్ తదితర అధికారులంతా యోగాసనాలను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వారు వెళ్లిపోయారు.
శాస్త్రోక్తంగా సౌర హోమం
అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం సౌరహోమంతో రథసప్తమి మహోత్సవాలను ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ ఈఓ వై.భద్రాజీ సమక్షంలో వేదమంత్రాలు, మంగళధ్వనుల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతుల గోత్రనామాలతో ఈ హోమాన్ని నిర్వహించారు.
అరసవల్లి మిల్లు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సూర్య భగవానుడి విగ్రహం
అపురూపం
అరసవల్లి: రథ సప్తమి వేళ అరసవల్లి మిల్లు జంక్షన్ అపురూపంగా మా రింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రజారోగ్య విభాగ ఎస్‌ఈ సుగుణాకరరావు పర్యవేక్షణ లో జరిగిన ఈ సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అరసవల్లికి మార్గం చూపేలా అద్భుతంగా ఫైబర్ రెయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ (ఎఫ్‌ఆర్‌పి)తో తయారు చేసిన 18 అడుగుల సూర్యరథ చక్రం చూపరులను ఆకట్టుకుంటోంది. దీనికి ముందు ఏడు గుర్రాలతో శ్రీసూర్యనారాయణుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశా రు. ఇక వీటితో పాటు ‘సూర్యనమస్కారాలను’ ప్రతిబింబించేలా.. ఇదే మార్గంలో అద్భుతంగా 12 రకాల సూర్యనమస్కారాల భంగిమల విగ్రహాలను ఏర్పాటు చేశారు.
పసగాడ విగ్రహం ఏర్పాటు
మాజీ ఎమ్మెల్యే దివంగత పసగాడ సూర్యనారాయణ విగ్రహాన్ని ఆయనకు చెందిన మిల్లు కూడలిలోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో తర్వాత ప్రారంభిస్తారు.
నేటి అర్ధరాత్రి నుంచే క్షీరాభిషేకం
ఎన్నికల కోడ్ ఆంక్షల నడుమ దర్శనాలు
దాతల పాసులపై తగ్గని ఆందోళన
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీకి అందని ఆహ్వానం
అట్టహాసంగా రథ సప్తమి వేడుకలు ప్రారంభం
నేటి అర్ధరాత్రి నుంచి స్వామికి క్షీరాభిషేకం
మొదటి రోజు 3 వేల
మందితో సామూహిక సూర్యనమస్కారాలు
ఆలయంలో ఘనంగా మహా సౌరహోమం
డచ్ బంగ్లా వద్ద లోహ వి‘హంగామా’
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో జిల్లా కేంద్రంలో ఉత్సవ శోభ
80 అడుగుల రోడ్డులో సామూహిక సూర్యనమస్కారాలు
Comments
Please login to add a commentAdd a comment