లోహ వి‘హంగామా’
శ్రీకాకుళం: కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న డచ్‌భవనం మైదానంలో ఆదివారం ప్రారంభించిన హెలీ టూరిజంకు చక్కటి స్పందన లభించింది. పొగమంచు కారణంగా ఉద యం 11.30కు హెలీకాప్టర్ రైడ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవంలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయు డు పాల్గొన్నారు. కొందరికి ఆన్‌లైన్ టికెట్లు కొనడం రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మబ్బులు, పొగమంచు కా రణంగా 4.30 గంటలకు హెలికాప్టర్ రైడ్ నిలిపివేశారు.
గ్రీవెన్సులు రద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్/ శ్రీకాకుళం క్రైమ్ : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా కలెక్టర్, ఎస్పీ గ్రీవెన్స్‌లు రద్దు చేశారు. కోడ్ ముగిశాక మళ్లీ యథావిధిగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
రథసప్తమి ఏర్పాట్ల పరిశీలన
అరసవల్లి, శ్రీకాకుళం క్రైమ్: రథసప్తమి మహోత్సవాల ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాఽథ్ జెట్టి ఆదివారం ఉదయం స్వయంగా పరిశీలించారు. ఆదిత్యాలయానికి ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి వెళ్లి దర్శన మార్గాలన్నీ కలియతిరిగారు.
‘శోభా’యమానం
శ్రీకాకుళం కల్చరల్: రథసప్తమి వేడుకల్లో భా గంగా నిర్వహించిన శోభాయాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. డే అండ్ నైట్ కూడలి నుంచి అరసవల్లి ముఖద్వారం వరకు జరిగిన శోభాయాత్రలో కళాకారులు, కళా బృందాలు పాల్గొ ని ప్రదర్శన చేశాయి. ముందు అరసవల్లి సూ ర్యనారాయణ స్వామి సప్తాశ్వరూఢుడై బయల్దేరగా.. వెనుక దేవస్థానాల శకటాలు వెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment