ఇదేనా దాతలకిచ్చే గౌరవం..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అరసవల్లి దేవస్థానం దాత లపై పాలకులు పగబట్టినట్టు ఉన్నారు. ఒకవైపు దాత ల చొరవతో నిర్మించిన కట్టడాల కూల్చివేతపైన, మరోవైపు దాతలకు ఇవ్వాల్సిన పాసులను తగ్గించడంపైన మనస్తాపం చెందుతున్నారు. తమ సాయంతో నిర్మించిన కట్టడాలను కూల్చడం ద్వారా పేరు పోయిందని, దాంతో పాటు తమకు ఇవ్వాల్సిన పాసులు కూడా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్ నిధులతో హడావుడి పనులు
రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగగా ప్రకటించా రు. కానీ ప్రత్యేకంగా నిధులిచ్చేది లేదని జీఓలోనే ప్రభుత్వం చెప్పేసింది. దీంతో కార్పొరేషన్‌లోనూ, శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా)లో ఉన్న నిధులతో పండగ ఏర్పాట్లు చేసేశారు. హడావుడిగా పాలకొండ రోడ్డులో సెంట్రల్ లైటింగ్‌తో ఉన్న డివైడర్లను కూల్చేసి కొత్తగా డివైడర్ ని ర్మాణం చేపట్టి, దాంట్లో మళ్లీ కొత్తగా సెంట్రల్ లై టింగ్ పెట్టారు. పాత బస్టాండ్ నుంచి అరసవల్లి దగ్గర వరకు పాత లైటింగ్‌ను పక్కన పెట్టేసి సెంట్రల్ లైటింగ్ పెట్టారు. ఇక మిల్లు జంక్షన్ దగ్గర బ్యూటిఫికేషన్ పనులైతే కట్టడం, కూల్చడం, కట్టడం, కూల్చడం, కట్టడం వంటివి జరిగాయి. ఇక, ప్రధాన కూడళ్లకు, డివైడర్లకు ఉన్న రంగులను చెరిపేసి కొత్త రంగులు వేశారు. ఈ పనులన్నింటికీ ఎప్పుడు కాంట్రాక్ట్ పిలిచారో ఎవరికిచ్చారో స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ఈ కాంట్రాక్ట్‌ల విషయంలో పెద్ద ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతపైనా అనుమానాలు ఉన్నాయి.
దాతలపై కక్ష
దాతల విషయానికొచ్చే సరికి పాలకులు కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చేపట్టే అనేక ని ర్మాణాలు దాతల సాయంతో చేసినవే. రాష్ట్ర పండగగా గుర్తించాక ప్రస్తుత పాలకులు ఆలయం విస్తరణ పేరుతో కూల్చివేతలకు దిగింది. ఇప్పటికే అ న్నదాన మండపం, ప్రసాదాల కౌంటర్, సూర్య న మస్కారాల మండపం, మరుగుదొడ్లు కాంప్లెక్స్, భక్తులకు నీడనిచ్చే జింకు రేకు షెడ్లను, క్యూలను కూల్చివేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీ మ్ వస్తుందని చెప్పి ఇవన్నీ చేశారు. స్కీమ్ మంజూరైన తర్వాత ఈ పనులు చేపట్టి ఉంటే బాగుండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కూల్చివేతల విషయాన్ని కనీసం దాతలకైనా చెప్పలేదు. ఈ వైఖరి దాతలు మనసులను నొప్పిస్తోంది.
అరసవల్లి దేవాలయం దాతలపై పగబట్టిన పాలకులు
దాతల సాయంతో నిర్మించిన కట్టడాలను సమాచారం లేకుండా కూల్చివేత
దర్శన పాసులకు కోత పెట్టిన దుస్థితి
Comments
Please login to add a commentAdd a comment