1996 నుంచి దేవస్థానానికి దాతలు విరాళాలిస్తున్నారు. వారికి రథసప్తమి రోజున గౌరవించేలా ప్ర త్యేక పాసులిచ్చి దర్శనం కల్పిస్తుంటారు. రూ.లక్ష విరాళం ఇస్తే ఒక డోనర్ పాస్, రూ. రెండు లక్షలు ఇస్తే రెండు డోనర్ పాసులు...ఇలా ఎన్ని లక్షలు ఇస్తే అన్ని డోనర్ పాసులు ఇచ్చేవారు. కానీ కూట మి ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు ఎందుకో దాతలపైనే పడ్డారు. వారికిచ్చే పాసులపై కఠినంగా వ్యవహరించాలని సాక్షాత్తు స మావేశంలోనే ఆదేశించారు. దీంతో దాతల పాసుల వ్యవహారం సమస్యగా మారింది. తొలుత దాతలందరినీ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడమే వివాదాస్పదం కాగా, ఇప్పుడా దాతలకిచ్చే పాసుల విషయంలో కూడా వివాదం చోటు చేసుకుంది. రూ.రెండు లక్షలు కట్టిన వారికి ఒక పాసు, రూ.మూడు లక్షలు కట్టిన వారికి ఒకటే పాసు, రూ. 4లక్షలు కట్టిన వారికి రెండు పాసులు, రూ. 5లక్షలు కట్టిన వారికి మూడు పాసులు ఇస్తున్నారు. ఒకాయన రూ.14లక్షలు కడితే కేవలం ఐదు పాసు లే ఇచ్చారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు మాత్రం వీరికంటే కాస్త ఎక్కువ ఇచ్చారు. దీనిపైనే చర్చ జరుగుతుంది.
సాక్షాత్తు తిరుపతిలోనే రూ. లక్ష విరాళం ఇస్తే ఏడాదిలో ఐదుగురికి రూ.300 టికెట్ల తో పాటు రూమ్ ఇస్తారు. కానీ అరసవల్లిలో మాత్రం దర్శన భాగ్యం కల్పించలేకపోతున్నారు. దీనిపై సాక్షాత్తు కలెక్టర్ ఎదుట ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడే గట్టిగా అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment