![ఆల్బెండజోల్ పంపిణీ 93.49 %](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10cto83-280004_mr-1739216085-0.jpg.webp?itok=MHDzBmWh)
ఆల్బెండజోల్ పంపిణీ 93.49 %
అరసవల్లి: జిల్లాలో 93.49 శాతం మందికి సోమవారం సాయంత్రానికి ఆల్బెండజోల్ మాత్రలను వేయించారు. జిల్లాలో ఈ మేరకు లక్ష్యం 4,46,992 కాగా.. సోమవారం సాయంత్రానికి 4,17,936 మంది విద్యార్థులకు వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖాధికారుల సమక్షంలో డీవార్మింగ్ మాత్రలు వేయించడంతో జిల్లాలో డీవార్మింగ్ లక్ష్యం 93.49 శాతంగా నమోదైనట్లుగా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి బాలమురళీకృష్ణ ప్రకటించారు. జిల్లాలో కొత్తూరు మండలం మెట్టూరులో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పాఠశాల విద్యార్థులతో పాటు పాఠశాల, కళాశాలలకు దూరంగా ఉన్న విద్యార్థులకు కూడా ఈ డీవార్మింగ్ మాత్రలను వేయించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించినట్లుగా డీఎంహెచ్‌ఓ బాలమురళీకృష్ణ తెలియజేశారు.
శాలిహుండం ఆదాయం రూ.15,22,003
గార: భీష్మ ఏకాదశి పర్వదినాన శాలిహుండం కాళీయ మర్ధన వేణుగోపాల స్వామి తీర్థ యా త్ర సందర్భంగా హుండీలు, అభిషేకాలు టిక్కె ట్లు ద్వారా 15 లక్షల 22వేల మూడు రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అనువంశిక ధర్మకర్త సుగ్గు మధురెడ్డి, దేవదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ప్రసాదబాబులు తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో హుండీలు తెరిచి లెక్కించారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.3,12, 000, అభిషేకం టిక్కెట్ల ద్వారా రూ.5,95,750లు, కేశఖండనల ద్వారా రూ.2,160లు, ప్రసాదాలు అమ్మకాల ద్వారా రూ.60వేలు, హండీల ద్వారా రూ. 5,52,093లు వచ్చిందని తెలిపారు. గత ఏడాది కంటే అదనంగా రూ.2.13 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment