![మొదలైన ప్రాక్టికల్ పరీక్షలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10cto24-280016_mr-1739216086-0.jpg.webp?itok=UnPPiZSn)
మొదలైన ప్రాక్టికల్ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 113 కేంద్రాలు కేటాయించగా తొలి విడతగా 61 కేంద్రాల్లో సోమవారం ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు బ్యాచ్‌లుగా పరీక్షలు కొనసాగాయి. ప్రాక్టికల్స్‌కు ఫిజిక్స్ పరీక్షకు 14,923 మంది, కెమిస్ట్రీ పరీక్షకు 14,922 మంది, జువాలజీ పరీక్షకు 4,808 మంది, బోటనీ పరీక్షకు 4,808 మంది, ఒకేషనల్ పరీక్షలకు 2,360 మంది హాజరవుతారు. డీఈవో కన్వీనర్/ఆర్‌ఐవో ప్రగద దుర్గారావు, డీఈవో కమిటీ సభ్యులు, తనిఖీ బృందాలు పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment