![హైవే పనులపై హైటెన్షన్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10etl42-280023_mr-1739216086-0.jpg.webp?itok=Hdb-W5Ya)
హైవే పనులపై హైటెన్షన్
రణస్థలం: రణస్థలం టౌన్‌లో జాతీయ రహదారిపై నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్ పనుల వల్ల స్థానిక వ్యాపారులు, భవన యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఫ్లై ఓవర్ వ్యతిరేక కమిటీ సభ్యులు డీజీఎం ఆనందరావు, పచ్చిగుళ్ల సాయిరాం, ఇ.తిరుపతిరాజు, పిన్నింటి సత్యంనాయుడుతో పాటు పలువురు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభిస్తున్న ఫ్లై ఓవర్ పనులు నిలిపి వేసి స్థానికులకు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ ఫ్లై ఓవర్ వ్యతిరేక కమిటీ సభ్యులు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సూపరింటెండెంట్ డీవీఎస్ నారాయణమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యతిరేక కమిటీ సభ్యులు మాట్లాడుతూ హై వే అధికారులు ఎలాంటి ప్రకటన లేకుండా జాతీ య రహదారికి ఇరువైపులా ఇష్టారాజ్యంగా మార్కింగ్ వేస్తూ పనులు చేస్తున్నారని, ఇప్పటికే ఈ పనులు నిరసిస్తూ ఒక రోజు రణస్థలం టౌన్‌లో బంద్ చేపట్టామని తెలిపారు. హైవే, రెవెన్యూ అధికారులు స్పష్టమైన వైఖరి తెలియజేయకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. దీనిపై సూపరింటెండెంట్ నారాయణ మూర్తి మాట్లాడుతూ హైవే అధికారులతో సమావేశం నిర్వహిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment