తామరభరణి నదిలో కొట్టికుపోయిన తాగునీటి పైప్‌లైన్
సాక్షి, చైన్నె : తమిళనాడును ఒకే నెలలో రెండు ప్రళయాలు చుట్టుముట్టాయని సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వరద విలయం నష్టం తీవ్రతను వివరించేందుకు సీఎం స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు. తమిళనాడును ఆదుకునేందుకు నిధులు కేటాయించాలని అభ్యర్థించేందుకు వెళ్లే ముందుగా మంగళవారం ఉదయం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 4న మిచాంగ్ రూపంలో చైన్నె శివారు జిల్లాలో అతలాకుతలమయ్యాయని గుర్తు చేశారు. ఇక్కడ సాధరణ పరిస్థితులు నెలకొన్నాయో లేదా, ఉపరితల ఆవర్తనం రూపంలో తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాశిలు వరద విలయాన్ని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. మిచాంగ్ రూపంలో ఎదురైన నష్టాలకు తాత్కాలిక ఉపశమనంగా రూ. 7 వేల 33 కోట్లు కేటాయించాలని, శాశ్వత నివారణకు రూ. 12,659 కోట్లు అందజేయాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్టు గుర్తు చేశారు. తాను ఢిల్లీకి వచ్చినా తన మనసు అంతా తమిళనాడులో జరుగుతున్న సహాయక చర్యలౖపైనే ఉందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈరెండు జిల్లాలో వర్షం పడిందని, కాయల్ పట్నంలో ఏకంగా 95 సెం.మీ వర్షం పడటం బట్టి చూస్తే ఏ మేరకు వరద విలయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం కన్నా, అధిక వర్షం పడిందని, బాధితులను ఆదుకునేందుకు 15 మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నారని వివరించారు. 375 మందితో కూడిన అగ్నిమాపక బృందాలు, 275 మందితో కూడిన 15 రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాలు, ఆర్మీ, నేవి సిబ్బంది సహాయక పనుల్లో ఉన్నట్టు వివరించారు.
నేడు తూత్తుకుడి, తిరునల్వేలిలో పర్యటన
ద్వారా ఆహారం అందిస్తున్నామని, అందరినీ ఆదుకుంటామని సీఎం స్టాలిన్ భరోసా ఇచ్చారు. చైన్నె, శివారన్‌జిల్లాలతో పాటు దక్షిణాది జిల్లాల్లోని వరద నష్టాలను కూడా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం తాను తూత్తుకుడి వెళ్తున్నట్టు, తిరునల్వేలిలో పర్యటించనున్నట్లు తెలిపారు. కేంద్రం నిధులను విడుదల చేస్తుందన్న నమ్మకంతో ఉన్నామని ఈసందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అధికారులతో గవర్నర్ సమీక్ష గురించి ప్రశ్నించగా, కరోనా వంటి విపత్తుల సమయంలో అధికారులతో ప్రధాని చర్చించి నిర్ణయాలు తీసుకున్నారని, అదే రాష్ట్రపతి చర్చించి ఉంటే? అని ఎదురు ప్రశ్న వేశారు. అలా ఉంది తమిళనాడులో గవర్నర్ తీరు అని పేర్కొంటూ, బాధిత ప్రజలను ఆదుకోవడమే తమ లక్ష్యమని ఆ దిశగా అదనపు మంత్రులను రంగంలోకి దించి కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. అలాగే సహాయక చర్యలను సమన్వయం చేసుకుని బాధితులను ఆదుకోవడం , భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తామన్నారు. ఇక సహాయక చర్యల కోసం అదనపు హెలికాప్టర్లను అందించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ వరదలకు 40 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితులయ్యారని, వీరిని ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
● ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ వినతి
Comments
Please login to add a commentAdd a comment