క్లుప్తంగా
గుండెపోటుతో
తహసీల్దార్ మృతి
తిరువళ్లూరు: దీపావళి పండుగ జరుపుకోవడానికి సొంత జిల్లాకు బయలుదేరిన స్పెషల్ తహసీల్దార్ గుండెపోటుతో మృతిచెందారు. అరియలూరు జిల్లా సన్నాసినల్లూరు గ్రామానికి చెందిన మణిగండన్. ఇతను గతంలో పొన్నేరి తహసీల్దార్‌గా పనిచేసి ఇటీవల చైన్నె ఔటర్ రింగ్ రోడ్ స్పెషల్ తహసీల్దార్‌గా తిరువళ్లూరులో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సెలవుల నేపథ్యంలో సొంత గ్రామమైన అరియాలూరు జిల్లా సన్నాసినల్లూరుకు బుధవారం బయలుదేరారు. గురువారం వేడుకల్లో నిమగ్నమై ఉండగా రాత్రి హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు సమీపంలోని వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు
అభివృద్ధి చెందాలి
వేలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెంది నిరుపేద విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే మేధాశక్తిని పెంచే విధంగా విద్యా బోధన చేయాలని తహసీల్దార్ జగదీశన్ తెలిపారు. ప్రపంచ రెడ్‌క్రాస్ నిర్వహకులు జీన్ హెండ్రీ డోనాండిన్ 115వ వర్ధంతి పురష్కరించుకుని కాట్పాడిలోని జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు సేవాభావాన్ని అలవరిచే విధంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే సేవాభావం అలవాటు అవుతుందన్నారు. రెడ్‌క్రాస్ సంఘం కార్యదర్శి సేనా జనార్దన్, ఉపాధ్యక్షులు పారివల్లల్, శ్రీనివాసన్, కోశాధికారి పయణి, విజయకుమారి, రెడ్‌క్రాస్‌సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment