కోవైలో దీపావళి బహిష్కరణ
సేలం: దేశమంతటా దీపావళి పండుగను దీపాలను వెలిగించి, మిఠాయిలను పంచుకుని, బాణసంచా పేల్చి కోలాహలంగా జరుపుకోగా, తందై పెరియార్ ద్రావిడ కళగం పార్టీ కోవై నేతలు మాత్రం దీపావళి పండుగను బహిష్కరించారు. ఈ సందర్భంగా కోవై గాంధీపురం ప్రాంతంలో ఉన్న పెరియార్ గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీపావళి పండుగను బహిష్కరించి నరకాసురునికి వీర వందనం ఘటించారు. ఈ సందర్భంగా తందై పెరియార్ ద్రావిడ పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణన్ మాట్లాడుతూ దీపావళి అనేది నరకాసురుని హత్య చేసిన రోజని, నరకాసురుడు చనిపోయిన రోజును కోలాహలంగా జరుపుకోవాలని ఒక పురాణం తెలుపుతున్నట్టు కథలు చెప్పి, ప్రజలను నమ్మించి జరుపుకునేదే దీపావళి పండుగ అని అన్నారు. అసురులను చంపిన రోజులనే ఆర్యులు పలు కథలుగా రూపొందించినట్టుగాను, ఆర్యులు– ద్రావిడుల పోరాటమే పురాణాలు అని జవహర్‌లాల్‌నెహ్రూ తెలిపారన్నారు. ఆర్యులు – ద్రావిడులు అనే విషయానికి వస్తే మన పూర్వికులు ఊహాజనిత రచనలుగాను, అందులో హెచ్చు, తగ్గు భేదాలను రూపరచనలు చేశారని అభిప్రాయపడ్డారు. నరకాసురుడు మన పూర్వికుడు కావడంతో నరకాసురునికి వీర వందనం చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో తందై పెరియార్ ద్రావిడ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment