పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం!
● రాష్ట్ర మంత్రి నాజర్
తిరువళ్లూరు: ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే శ్రేయస్కరమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోషకాహారాన్ని నిర్ధారించండి పేరుతో కార్యక్రమాన్ని 2022వ సంవత్సరంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులోభాగంగానే ప్రతి ఏడాది నవంబర్ రెండవ వారంలో బాలింతలకు పౌష్టికాహారం, న్యూట్రీషియన్ కిట్‌ను అందజేసే కార్యక్రమాలను విసృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్‌లో బాలింతలకు పోషకాహార కిట్‌ను అందజేసే కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రభుశంకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి నాజర్ హాజరై 2,926 మందికి కిట్‌ను అందజేశారు. అనంతరం ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ జన్మించిన శిశువుకు ఆరునెలల వరకు తల్లిపాలే శ్రేయస్కరమని వ్యాఖ్యానించారు. మొదటి దశలో జిల్లాలోని బాలింతలకు 1,743 మందికి, రెండవ దశలో 2,926 మందికి పోషకాహార కిట్‌లను అందజేసినట్టు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణస్వామి, మేయర్ ఉదయకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment