ఘనంగా సినీ, బుల్లితెర తారల అవార్డుల వేడుక
తమిళసినిమా: అవార్డులు నటినటుల ప్రతిభకు నిదర్శనం. అయితే అదే అవార్డులు వర్ధమాన తారల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇలాంటి భావనతోనే సాంస్కతిక సంస్థలు అయినా మహాఫైన్ ఆర్ట్స్ అధినేత అనురాధ జయరామన్ యునైటెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ అధినేత, కలైమామణి, డా.నైల్లె సుందర్ రాజన్ సంయుక్తంగా చాలాకాలంగా ఈ కళా సేవను చేస్తున్నారు. పలువురు సామాజిక సేవకులను గౌరవిస్తూ ఉత్తమ అవార్డులను ప్రదానం చేస్తున్నారు అదేవిధంగా సినీ బుల్లితెర నటీనటులను ప్రోత్సహించే విధంగా అవార్డులతో సత్కరిస్తున్నారు. ఇందుకు హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ఎస్.కె కష్ణన్ తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అలాంటి అవార్డుల వేడుకను శనివారం సాయంత్రం స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని శిఖరం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ఎస్‌కే కష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేదికపై పరువరు సామాజిక సేవకులను ఆయన ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సినీ నటుడు ఆదేశ్ బాల, నటి ఆలియాకు ప్రత్యేక ఉత్తమ నటి అవార్డులను ప్రదానం చేశారు. కాగా కుమారి జీవిత ఉత్తమ నూతన నటి అవార్డును, నటి శ్రీవిద్యకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డును అందించి వారిని అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రీయ రత్నం ఏఎంబీ డాక్టర్ బి.కె. వెంకటేశం తమిళన్ టీవీ రిపోర్టర్ డాక్టర్ ఎన్‌ఆర్. చంద్రశేఖరన్, కన్జ్యూమర్ విగిలెంట్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డాక్టర్ కే యం చంద్రమోహన్, ఆల్బర్ట్ థియేటర్ నిర్వాహకుడు ఎ.మారియప్పన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
పూజా హెగ్డే
ఆయన ప్రేమ కథను తెరకెక్కిస్తే ..?
తమిళసినిమా: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అది విజయం అయినా పరాజయం అయినా. అలాగే అవకాశాలు రావడం అన్నది కూడా మన చేతుల్లో ఉండదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం. నటి పూజాహెగ్డే సినీ జీవితం కూడా ఇలానే సాగుతోంది. గత పుష్కర కాలం క్రితం ముఖమూడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఉత్తరాది భామ ఈమె. ఆ చిత్రం పూర్తిగా నిరాశపరచడంతో ఈ అమ్మడిని కోలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో ఇక్కడ మూటా ముల్లు సర్దేసుకున్న పూజాహెగ్డే టాలీవుడ్‌లో మకాం పెట్టారు. అక్కడ కూడా తొలి దశలో కెరీర్ ఆశాజనకంగా లేకపోయినా, ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించిన చిత్రాలు విజయం సాధించడంతో ఈమెకు క్రేజ్ పెరిగింది. కొద్దికాలం టాప్ హీరోయిన్‌గా రాణించిన పూజాహెగ్డేకు ఆ తర్వాత వచ్చిన వరుస ప్లాప్ లతో మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు ముఖం చాటేశాయి. అదే సమయంలో బాలీవుడ్, కోలీవుడ్‌లో నటించిన చిత్రాలు కూడా అపజయం పాలయ్యాయి. అలాంటిది బ్యూటీకి ఇప్పుడు మళ్లీ దశ తిరిగింది. తమిళంలో రెండు భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు తలుపు తట్టాయి. అందులో ఒకటి సూర్యతో జత కట్టే ఆయన 44వ చిత్రం కాగా, మరొకటి విజయ్ సరసన నటించే ఆయన 69వ చిత్రం కావడం విశేషం. కాగా పూజాహెగ్డే సూర్య సరసన నటించిన చిత్రాన్ని పూర్తి చేశారు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ఇది గ్యాంగ్స్టర్స్ ఇతి వృత్తంతో రూపొందుతున్నట్లు కథా చిత్రం అంటూ ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పటికీ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి పూజాహెగ్డే ఓ భేటీలో ఈ చిత్రం గురించి కొత్త అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ లవ్‌స్టోరీ రాస్తే ఎలా ఉంటుందో అలా సూర్య 44 చిత్రం ఉంటుందన్నారు. ఇందులో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఈమె విజయ్‌కు జంటగా ఆయన 69వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి హెచ్ .వినోద్ దర్శకుడు అన్నది తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment