క్లుప్తంగా
గాయపడిన మహిళ
చికిత్స పొందుతూ మృతి
తిరువళ్లూరు: ద్విచక్ర వాహనం నుంచి జారి కిందపడ్డ మహిళ చిక్సిత పొందుతూ మృతి చెందారు. వివరాలు.. గుమ్మిడిపూండి తాలుకా ఓబసముద్రం గ్రామానికి చెందిన బాబు భార్య తులసి(35). ఈమే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చిక్సిత తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 12న రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి అక్కడ మాత్రలు తీసుకుని తిరుగు ప్రయాణమైయ్యారు. గుమ్మిడిపూండి సమీపంలోని తురపళ్లం వద్ద బస్సు కోసం వేచి వున్న సమయంలో అదే మార్గంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న జయగణేష్ వద్ద లిప్టు అడిగి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ద్విచక్ర వాహనం సున్నాంబట్టి జంక్షన్ వద్ద వస్తున్న సమయంలో మహిళ జారికిందపడి గాయపడింది. స్టాన్లీ వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందారు.
టెలిఫోన్ స్తంభాన్ని
ఢీకొని కారుబోల్తా
తిరువళ్లూరు: రాణిపేట జిల్లా షోలింగర్ ప్రాంతానికి చెందిన పార్తీబన్(42) కోళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వ్యాపార పనుల నిమిత్తం కారులో తిరువళ్లూరు జిల్లా ఆవడికి వెళ్లి మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. కారు తన్నీర్‌కుళం వద్ద వస్తున్న సమయంలో అదుపు తప్పి టెలిఫోన్ స్తంభాన్ని, పక్కనే ఉన్న ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడి పార్తీబన్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాధితుడిని తిరువళ్లూరు జిల్లా వైద్యశాలకు తరలించి చిక్సిత అందిస్తున్నారు. సెవ్వాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారంలో తీవ్ర నష్టం
● విషం తాగి మహిళ మృతి
తిరువళ్లూరు: వ్యాపారంలో తీవ్ర నష్టం రావడంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ గణేశపురం పెరియార్ వీధికి చెందిన తమిళరసన్, జయంతి దంపతులు. వీరు అదే ప్రాంతంలో పాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 13వ తేదీన పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం జయంతి మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఎండీఎంకే కార్యాలయం
ధ్వంసం ●
● నలుగురు అరెస్టు
సేలం: కోవై ఆవారంపాలయం పస్ స్టాండ్ సమీపంలో కృష్ణరాయపురం ఉంది. ఇక్కడ ఉన్న ఓ భవనంలో కోవై నగర జిల్లా ఎండీఎంకే 28వ వార్డు కార్యాలయం పని చేస్తోంది. ఆ భవనంలో ముత్తమిళ్ పడిప్పగం పేరిట లైబ్రరీని కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మట్టిగోడలతో నిర్మించిన ఈ భవనాన్ని అదే ప్రాంతానికి చెందిన సుందర్‌రాజన్ తనకు సొంతమైనదిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ స్థితిలో శనివారం కొందరు గుర్తుతెలియని ముఠా ప్రొక్రైన్ ద్వారా ఆ భవనాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో ఉదయం ఎప్పటిలానే కార్యాలయానికి వెళ్లిన ఎండీఎంకే కార్యకర్తలు భవన కూలి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. దీనిపై ఆ ప్రాంత ఎండీఎంకే కార్యదర్శి వెల్లంగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుందర్‌రాజన్, సెంథిల్ కుమార్, గోపాల కృష్ణన్ తదితర నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద విచారణ జరుపుతున్నారు.
వైర్లు రాసుకుని మంటలు
● కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
అన్నానగర్: చైన్నెలోని గిండీ ఆలందూర్ రోడ్డులో కలైంజ్ఞర్ సంతాన స్పెషల్ హయ్యర్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ ఉంది. ఆలందూరు రోడ్డు నుంచి ఆసుపత్రికి వెళ్లే 4 ప్రధాన విద్యుత్ తీగలకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగమంచులా మారింది. పక్కనే ఉన్న జనరేటర్‌కు వెళ్లే కేబుళ్లకు కూడా మంటలు అంటుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు పైగా వైద్య సేవలు ఆగిపోయాయి. దీంతో అస్పత్రికి ఎవరిని అనుమతించలేదు. దీనిపై సమాచారం అందుకున్న విద్యుత్ బోర్డు ఉద్యోగులు హడావుడి చేశారు. బ్యాక్‌ప్యాక్‌లో ఉంచిన బ్యాటరీలతో రోగులను వెంటనే అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ, ప్రజాపనుల శాఖ, విద్యుత్ శాఖ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించి విద్యుత్ కనెక్షన్ ఇచ్చే పనులను వేగవంతం చేశారు. విద్యుత్తు కనెక్షన్ అందించడంతోపాటు ప్రభావిత ప్రాంతంలో దెబ్బతిన్న కేబుళ్లకు మరమ్మతులు త్వరగా చేపట్టారు. ఈ విషయమై మంత్రులు ఎం.సుబ్రమణియన్, ఎ.వి.వేలు అధికారులతో ఆరా తీశారు. ఆ సమయంలో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment