కార్మికుల ఆందోళన
తిరువళ్లూరు: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఫర్నిచర్ కంపెనీ కార్మికులను ఆందోళన నిర్వహించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాకలూరు సిప్‌కాట్‌లో కేకే బిర్లా పర్నిచర్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను 1998వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రారంభించారు. సంబంధిత సంస్థలో 73 మంది పర్మినెంట్ ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పర్నిచర్ విక్రయాలు, వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదన్న నిర్వాహకులు గత మార్చి నుంచి కార్మికులకు వేతనాలతో కూడిన సెలవులు ఇచ్చారు. అనంతరం గత రెండు వారాల క్రితం కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ.3.50 లక్షలు చొప్పున సెటిల్‌మెంట్ మొత్తాన్ని జమచేశారు. అయితే పరిశ్రమ నిర్వాహకులు తీసుకున్న చర్యలను నిరసిస్తూ కార్మికులు ఆందోళన నిర్వహించారు. కార్మికులను పరిశ్రమ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించడాన్ని నిరసించారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కానీ పక్షంలో సెటిల్‌మెంట్ మొత్తాన్ని పెంచి ఇవ్వాలని నినాదాలు చేశారు. బిర్లా గ్రూపు నిర్వాహకులు ప్రస్తుతం పర్నిచర్ సంస్థ వున్న ప్రాంతంలోనే వేరే వ్యాపారం చేయాలని నిర్ణయించిందని అయితే సంబంధిత సంస్థలో తమకు ఉపాధి కల్పిండానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారని వాపోయారు. అనంతరం కంపెనీ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో కార్మిక సంఘం నేతలు గణపతి, ఏకాంబరంతో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment