ఎలక్ట్రిక్ రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
కొరుక్కుపేట: చైన్నె, సబర్బన్ ప్రాంతాలలో రైల్వే ట్రాక్‌లపై నిర్వహణ పనుల కారణంగా ఎలక్ట్రిక్ రైలు సేవలు అకస్మాత్తుగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు.. చైన్నె – తాంబరం మధ్య తాంబరం వర్క్‌షాప్‌లో ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహణా పనులు చేపడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అన్ని ఎలక్ట్రిక్ రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బీచ్ – పల్లావరం మధ్య మాత్రమే ప్రత్యేక రైలును నడిపారు. సాధారణ రైలు సర్వీసు ఆదివారం టైమ్‌టేబుల్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే నడుస్తుందని ప్రకటించారు. దీంతో రైల్వేస్టేషన్‌కు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. నిర్వహణ పనుల కోసం అదనపు సిబ్బందిని నియమించి, 24 గంటల్లో సరిదిద్దాల్సిన బాధ్యత దక్షిణ రైల్వేపై ఉంది. అయితే దీనిని దక్షిణ రైల్వే పాటించడం లేదు. ఫలితంగా నెలరోజులుగా పగటిపూట రైళ్లను రద్దు చేస్తున్నారు. మెయింటెనెన్స్ పనులు ఎన్ని నెలలు నిర్వహిస్తారో ప్రజలకు తెలియజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment