కాట్పాడిలో ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని కయంజూరు, తారాపడవేడు చెరువుల్లో పడవ సవారీ ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక స్థలంగా మార్చేందుకు ప్రభుత్వం రూ. 28 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఇప్పటికే పనులు ప్రారంభించి సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారు. త్వరలోనే ఈ రెండు చెరువుల్లోను పడవ సవారీ ఏర్పాటు చేసి పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. ఇదిలా ఉండగా చెరువుతో పాటు కాలువల్లో కొందరు ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఈ ఆక్రమలను తొలగించాలని ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో కొంతమంది ఇళ్లను ఖాళీ చేయగా.. మరికొందరు ఇంకా అలేగా ఉన్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు పోలీసులు, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుస్తుగా వారితో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం పోలీసుల సాయంతో అధికారులు శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఖాశీ చేసిన సుమారు 300 కుటుంబ సభ్యులకు కరిగేరి గ్రామంలో నూతనంగా నిర్మించిన హౌసింగ్ బోర్డులో ఇళ్లను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment