కిలాంబాక్కం నుంచి పంబకి ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

కిలాంబాక్కం నుంచి పంబకి ప్రత్యేక బస్సులు

Published Tue, Nov 19 2024 1:25 AM | Last Updated on Tue, Nov 19 2024 1:25 AM

-

తిరువొత్తియూరు: శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం శబరిమల ఎక్స్‌ప్రెస్‌ బస్సు చైన్నె, తిరుచ్చి, మధురైతో సహా నగరాల నుంచి ప్రారంభించబడింది. అదేవిధంగా అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం మొదట పంౖబ నుంచి కిలాంబాక్కంకు ప్రత్యేక బస్సును విధిగా నడిపారు. ఇక మండల పూజ కోసం శబరిమల అయ్యప్పన్‌ ఆలయం ఆదివారం తెరిచారు. దీంతో శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం, తమిళనాడులోని ప్రధాన నగరాల నుంచి ప్రభుత్వ త్వరిత రవాణా సంస్థ ప్రతి సంవత్సరం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 16 వరకు భక్తుల కోసం చైన్నె కోయంబేడు, కిలాంబాక్కం, తిరుచ్చి, మదురై, పుదుచ్చేరి, కడలూరు నుంచి పంబ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement