పైపును బాగు చేయాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

పైపును బాగు చేయాలని నిరసన

Published Wed, Nov 20 2024 12:43 AM | Last Updated on Wed, Nov 20 2024 12:42 AM

పైపును బాగు చేయాలని నిరసన

పైపును బాగు చేయాలని నిరసన

అన్నానగర్‌: దిండుక్కల్‌ సమీపంలో మంగళవారం పగిలిన పైపును బాగు చేయాలంటూ రోడ్డు మధ్యలో మంచంపై పడుకుని రైతు నిరసన చేపట్టాడు. దిండుక్కల్‌ జిల్లాలోని కొంబాయిపట్టి పాదాలలో మూలకడై ప్రాంతం ఉంది. కొద్ది రోజుల క్రితం మూలకడై ప్రాంతానికి వెళ్లే తాగునీటి పైపు పగిలిపోయింది. దీంతో అక్కడి నీటి సరఫరాపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. అనంతరం పంచాయతీ కార్మికులు అక్కడకు వెళ్లి పగిలిన పైపును సరిచేశారు. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఈశ్వరి తన తోటలో నుంచి వెళుతున్న పైపు పగిలిపోయిందని, మరమ్మతులు చేయవద్దని నిరసన తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంగళవారం మూలకడై ప్రాంతానికి చెందిన రాజారాం(50) అనే రైతు మూలకడై–కొంబాయిపట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వాహనాలు వెళ్లకుండా అడ్డుగా వేశాడు. పగిలిపోయిన తాగునీటి పైపును సరిచేయాలని నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా రోడ్డు మధ్యలో మంచంపై పడుకుని ఆందోళన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న ఛత్రపట్టి పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం నిరసన తెలుపుతున్న రాజారాంతో చర్చలు జరిపారు. ప్రస్తుతం జరుగుతున్న పైపుల పగుళ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజారాంను పగిలిన పైపు మరమ్మతులను అడ్డుకోవద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఈశ్వరిని అధికారులు హెచ్చరించారు. ఆ తర్వాత రాజారాం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలాగే పంచాయతీ పాలకవర్గం పగిలిపోయిన పైపును సరిచేసే పనిలో నిమగ్నమైంది. ఓ రైతు రోడ్డు మధ్యలో మంచం వేసి నిరసన తెలిపిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement