తిరువొత్తియూరు: ముంబయి నుంచి ఉసిలంపట్టికి అక్రమంగా తీసుకువచ్చిన మత్తుమాత్రలను విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మత్తుమాత్రలను ఆౖన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ముంబయి నుంచి అక్రమంగా తెచ్చిన తర్వాత వాటిని విక్రయిస్తున్నట్లు తెలియ వచ్చింది. దీంతో ఉసిలంపట్టి తిరుమంగళం ప్రాంతంలో మత్తు మాత్రలు సప్‌లై చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో అతను ఉసిలంపట్టికి చెందిన మూవేంద్రన్ (25) అని తెలిసింది. 300 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
ఒకే చోట ఆరు కోతులు మృతి
అన్నానగర్: నీలగిరి జిల్లాలోని కొత్తగిరి నగర్ ప్రాంతంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్థాలు తినేస్తున్నాయి. వంట పాత్రలను కూడా పాడు చేస్తున్నాయి. కొత్తగిరి డాన్‌బాస్కో రోడ్డులోని ఆదివాసీ సంక్షేమ సంఘం కాంప్లెక్స్‌లో మంగళవారం ఆరు కోతులు చనిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కోతులను పరిశీలించారు. అనంతరం కోతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగిరి వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. కోతులకు విషం ఇచ్చి చంపారేమోనని అటవీశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.
పరిశ్రమలో మంటలు
తిరువొత్తియూరు: శ్రీపెరంబుదూరు సమీపం ఇరుంగాట్టుకోట్టై సిప్‌కాట్ ప్రాంతంలో కాంక్రీట్ మిక్సింగ్ మిషన్లు తయారవుతున్నాయి. ఇక్కడ 500 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. సోమవారం రాత్రి కూలీలు పనిలో ఉండగా మెషినరీ పెయింటింగ్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే అక్కడ ఉన్న పెయింట్ అంతా కాలిపోయింది. దీనిపై సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment