● మనస్తాపంతో కార్మికుడి ఆత్మహత్య ● తిరువేర్కాడులో 300 మంది ఆకస్మిక రోడ్డు దిగ్బంధం
కొరుక్కుపేట: ఆక్రమణకు గురైన ఇళ్లను కూల్చివేస్తున్నట్టు అధికారులు నోటీసులు అంటించారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో మంగళవారం 300 మంది ప్రజలు ఆకస్మికంగా రోడ్డు దిగ్బంధంనం చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. తిరువేర్కాడు వద్ద చెరువులో ఆక్రమణలకు గురైన ఇళ్లు, భవనాలపై దేవదాయ శాఖ అధికారులు సర్వే చేశారు. దాదాపు వెయ్యికి పైగా ఇళ్లు, భవనాలు సరస్సును ఆక్రమించి, కట్టినట్లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఆక్రమణలకు గురైన ఇళ్లు, భవనాల కూల్చివేతలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇందులో కొలాడి చెల్లియమ్మన్ నగర్‌లో నివాసముంటున్న కార్పెంటర్ శంకర్(44) ఇంటికి కూడా దేవదాయ శాఖ అధికారులు నోటీసులు అంటించారు. దీంతో మనస్తాపానికి గురైన శంకర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ పరిస్థితిలో శంకర్ ఆత్మహత్య సంఘటనతో ఆగ్రహించిన 300 మంది ప్రజలు మంగళవారం తిరువేర్కాడు–అంబత్తూరు రహదారిపై నిరసనకు దిగారు. శంకర్ మృతికి న్యాయం చేయాలని, ఇళ్లను తొలగించవద్దని నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ గోవిందరాజులు, పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ను చర్చలకు రావాలని డిమాండ్ చేస్తూ తమ నిరసన కొనసాగించారు. దీంతో ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ నెలకొంది. భద్రత కోసం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment