● బైకులో తీసుకొచ్చిన రూ.21 లక్షలు స్వాధీనం
అన్నానగర్: పారిమునై, మన్నడి తదితర ప్రాంతాల్లో హవాలా నగదు మార్పిడి జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నార్త్ కోస్ట్ పోలీసులు పారిమునై రాజాజీ రోడ్డులో మంగళవారం రాత్రి వాహన తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో బైకుపై అటుగా వచ్చిన యువకుడిని సోదా చేశారు. అతని వద్ద ఉన్న ఫుడ్ డెలివరీ బ్యాగ్‌లో నగదు నింపినట్లు గుర్తించారు. విచారణలో అతను గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న ఎలవూరుకు చెందిన అమానుల్లా (34)గా గుర్తించారు. ఈ డబ్బు యజమాని మలేషియాలో ఉన్నాడని, అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలో చెల్లించేందుకు తీసుకున్నానని చెప్పాడు. కానీ సరైన పత్రాలు లేని కారణంగా రూ.21 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. అదే విధంగా మన్నడి ప్రకాశం రోడ్డులోని తన ఇంటి నుంచి సెల్‌ఫోన్లు విక్రయిస్తూ చైన్నె ముత్తునాయకన్ వీధికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) సరైన పత్రాలు లేకుండా బైకులో తీసుకొచ్చిన రూ.11 లక్షలను ముత్యాల్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని కూడా ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు హవాలా డబ్బు కావచ్చునని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment