చైన్నెలో మెథాంఫెటమైన్ అక్రమ రవాణా
● ఎస్ఐ భర్త, కాంగ్రెస్ నాయకుడి సహా ఐదుగురు అరెస్టు
అన్నానగర్: చైన్నె నుంచి మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసిన ఎస్ఐ భర్తతో సహా ఐదుగురిని బుధవారం అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె పాడి బ్రిడ్జి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నట్లు చైన్నె వెస్ట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక దళానికి చెందిన పోలీసు అధికారి పాడి మెంబలం దగ్గర మారువేషంలో పర్యవేక్షిస్తూ బైకుపై అనుమానాస్పదంగా వచ్చిన ఇద్దరిని పట్టుకుని విచారణ చేపట్టారు. అప్పుడు వారు బైకులో మెథాంఫెటమైన్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి పుళల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా కుమారవేల్ అని తేలింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ప్రధాన వ్యక్తి, ప్రణాళికల అమలులో ప్రధాన వ్యక్తి. ఇతను మద్రాసు హైకోర్టులో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న వన్నారపేట పోలీస్‌స్టేషన్ స్పెషల్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ విశాలాక్షి భర్త అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో తిరువేర్కాడు ఆర్. ఎస్. పురం ప్రాంతానికి చెందిన సుభాష్, పుళల్ భక్తికి చెందిన గ్యాంగ్ నాయకుడు పార్థిబన్, ఓట్టేరి ప్రాంతానికి చెందిన అమీర్ పాషా, కావాంగరై ప్రాంతానికి చెందిన దీపక్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
వృద్ధుల కోసం
ఇంటి వద్దకే వైద్యం..
సాక్షి, చైన్నె: వృద్ధుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఇంటి వద్దకే హెల్త్ చెకప్ సేవలకు కావేరి ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. బుధవారం ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక బృందం ద్వారా ఈసీజీ, కంప్లీట్ బ్లడ్ కౌంట్, యూరిన్ అనాలిసస్, లిపిడ్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్, హెచ్‌బీఏ1సీ తదితర వైద్య పరీక్షలను, ఇంటి వద్దకు వచ్చే వృద్ధులకు చేసే రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ వీఎస్ నటరాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో వృద్యాప్య నిపుణులు, ఫిజియోథెరఫిస్ట్, సైకియాట్రిస్ట్, డైట్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ స్పెషలిస్టు, మల్టీ డిసిప్లినరీ బృందం సేవలను అందించనున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ, వృద్ధుల జనాభా పెరుగుతుండటాన్ని గుర్తు చేస్తూ, వారి అవసరాలకు అను గుణంగా సంరక్షణ, వైద్య పరంగాసేవల మీద దృష్టి పెట్టామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment