మహిళలకు పారిశ్రామిక తోడ్పాటు
సాక్షి, చైన్నె: పారిశ్రామికంగా మహిళలను ముందుకు తీసుకెళ్లే విధంగా, సాధికారతను ప్రోత్సహించే రీతిలో ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంది. సాధారణ పొదుపులతో ఆదాయాన్ని పెంపొందించే దిశగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తోడ్పాటు అందించేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. గురువారం మహిళలకు తోడ్పాటు అందించే విధంగా జరిగిన కార్యక్రమంలో ఫెడ్ ఎక్స్ ఇండియా ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు సువేందు చౌదరి మాట్లాడుతూ, చిన్న, మధ్యత రహా పరిశ్రమల ఆర్థికవృద్ధికి, పారిశ్రామికంగా మహిళలను నడిపించడమే లక్ష్యంగా అవసరమైన వనరులను, స్వయం సమృద్ది మార్గాలను కల్పిస్తున్నామని వివరించారు. ఎస్‌ఎంఈ పర్యావరణ వ్యవస్థలో మహిళు అభివృద్ధి చెందడానికి సమగ్రమైన , దీర్ఘ కాలిక తోడ్పాటు, లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment