బాలుడి గొంతులో చిక్కుకున్న గొలుసు బిరడా
సేలం : పెరంబలూరు జిల్లా ఎరుదుపట్టి ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడు తెలియకుండా ఇంటి గొలుసుల బిరడా మింగిశాడు. వెంటనే అతడిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు ఎక్స్‌రేలో బిరడా శ్వాసకోశంలోకి వెళ్లినట్లు గుర్తించారు. తర్వాత బాలుడిని తిరుచ్చి మహాత్మాగాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి డీన్ డాక్టర్ కుమరవేల్, ఈఎన్‌టీ విభాగ అధ్యక్షులు రాధాకృష్ణన్‌ల నేతృత్వంలోని వైద్య బృందం ఆ బాలుడికి చికిత్స చేసి తొలగించారు.
మ్యాట్రీమోనిలో పెళ్లి పేరిట మోసం
–కోవైకు చెందిన యువకుడి అరెస్ట్
తిరువళ్లూరు: రెండవ పెళ్లి కోసం మ్యాట్రీమోనిలో దరఖాస్తు చేసుకున్న మహిళలే లక్ష్యంగా మోసాలకు పాల్పడి లక్షల రూపాయలు గుంజుతున్న యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి కరైయన్‌చావడికి చెందిన జెస్సి(34). భర్త నుంచి విడాకులు పొంది రెండవ వివాహం కోసం క్రిస్టియన్ మ్యాట్రీమోనిలో దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో జెస్సీ ప్రొఫైల్‌ను లైక్ చేసిన లెనిన్ ఆమె అడ్రస్ తీసుకుని ఫోన్‌లో ఆరు నెలల పాటు మాటలు సాగించాడు. పెళ్లి చేసుకుంటానని జెస్సీని నమ్మించి ఆమే దగ్గర రూ.3లక్షల మేరకు వసూలు చేసి పెళ్లికి నిరాకరించడంతో పాటు తీసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధిత మహిళ ఆవడి కమిషనర్ శంకర్‌కు ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్ ఆధారంగా లెనిన్‌ను గుర్తించిన పోలీసులు కోయంబత్తూరులో అరెస్టు చేసి విచారణ చేశారు. విచారణలో ఇప్పటివరకు ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.20 లక్షల వరకు మోసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మహిళల నుంచి తీసుకున్న నగదుతో జల్సాలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు లెనిన్‌ను అరెస్టు చేసి పూందమల్లి జుడిషియల్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించడంతో పుళల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment