ప్రకృతిని పరిరక్షించుకోవాలి
తిరువళ్లూరు: ప్రపంచానికి వరప్రసాదంలా మారిన ప్రకృతిని పరిరక్షించుకుని భావితరాలకు అందించే బాధ్యతలను విద్యార్థులే తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో రుతుపవనాల మార్పు, మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు, నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేసే కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ హాజరై సర్టిఫికెట్‌లను అందజేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసగించారు. కలెక్టర్ మాట్లాడుతూ రుతుపవనాల మార్పు ఫలితంగా రోగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. రోగాల విస్తరణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో వరప్రసాదం లాంటి ప్రకృతిని పరిరక్షించి భావితరాలకు అందించే బాధ్యతలను విద్యార్థులు తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడం లాంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment