జీఓ రద్దు చేయాలని ఆందోళన
తిరువళ్లూరు: ఆలయ స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఏళ్ల తరబడి నివాసం వుంటున్న వారి నుంచి అద్దె వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన జీఓను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆలయ భూముల్లో నివాసం వుంటున్న బాధితులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో పలువురు బాధితులు ప్రసంగించారు. ఆలయ భూముల్లో నివాసం ఉంటున్న వారి నుంచి అద్దె వసూలుకు అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఇచ్చిన జీఓ 298, 456ను కొనసాగించాలని, ప్రస్తుతం చదరపు అడుగుల మేరకు అద్దె వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ 34ఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ భూముల్లో నివాసం వుంటున్న వారి పేరుతోనే విద్యుత్ బిల్లు, రసీదులు ఇవ్వాలని, ఆలయ స్థలంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment