వేలూరు: తిరువణ్ణామలై కార్తీక బ్రహ్మోత్సవాలు సుబ్రహ్మణ్యస్వామి తెప్పోత్సవంతో సోమవారం రాత్రితో ముగిశాయి. అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల4న ధ్వజా రోహణంతో ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఉదయంసాయంత్రం వేళల్లో స్వామి అమ్మవార్లు మాడ వీధులు, గిరివలయం రోడ్డులోను వివిధ అలంకరణల మద్య వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో అలసి పోయిన స్వామి వార్లుకు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈనెల 14వ తేదీన చంద్రశేఖరుడు, రెండవ రోజున పరాశక్తి అమ్మవారు, మూడవ రోజైన సోమవారం రాత్రి వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి తెప్పలపై ఊరేగారు. ముందుగా ఆలయ జాయింట్ కమిషనర్ జ్యోతి ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి ఆలయం సమీపంలోని అయ్యం కోనేటిలోని తెప్పలపై ఆశీనులను చేశారు. అనంతరం స్వామివారు తెప్పలపై మూడు సార్లు వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అఽధిక సంఖ్యలో చేరుకొని అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ నామస్మరణ చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మో త్సవాల్లో ఎటువంటి అవాంచనీయ ఘట నలు చోటు చేసుకోకుండా కాపాడిన స్వామివారికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పరిహార పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment