జీవీ.ప్రకాశ్ కుమార్ @ 100
తమిళసినిమా: దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి జీవీ ప్రకాష్ కుమార్. ఈయన సంగీత దర్శకుడిగా 100వ చిత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాకు ఒక ప్రకటనను విడుదల చేశారు . అందులో శ్ఙ్రీజీవీపీ 100 అచీవ్‌మెంట్‌కు బాట పరిచిన మీ అందరికీ కృతజ్ఞతలు.. చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను ఆ చిత్రానికి సంగీతాన్ని అందించడానికి అవకాశం కల్పించిన దర్శ కుడు వసంతవాలం నిర్మాత శంకర్‌కు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు పరిచయం చేసిన తర్వాత అనేక చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నాను రజనీకాంత్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, ధనుష్, చసిలంబరసన్ టీఆర్, ప్రభాస్, రవితేజ, సిద్ధార్థత, కార్తీ, ఆర్య, విశాల్, జయం రవి, శివకార్తికేయన్, దుల్కర్ స ల్మాన్, రామ్ పోతినేని, అధర ్వ, రాఘవ లారెన్స్, అరుణ్ విజయ్, భరత్, పశుపతి వంటి ప్రముఖ నటుల చిత్రాలకు సంగీతాన్ని అందించే అవకాశాన్ని పొందాను అదేవిధంగా ప్రముఖ దర్శక నిర్మాతల చిత్రాలకు పనిచేశాను. నటుడు కమలహాసన్ నటించిన చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన నిర్మించిన చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం లభించింది. ఈ చిత్రంలోని పాటలను సంగీతాన్ని విన్న కమలహాసన్ అభినందించటం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. సంగీత దర్శకుడు కానీ కాకుండా గాయకుడి గానూ అవకాశం కల్పించిన సంగీత దర్శకులకు నిర్మాతలకు దర్శకులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 2005లో సంగీత దర్శకుడిగా ప్రారంభమైన నా ప్రయాణం 2024లో 100వ చిత్రం చేసే వరకు మంచి అవకాశాలు అందుకున్నాను. సూరరై పోట్రు చిత్రానికి గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును తెలుసుకోవడానికి కారణమైన దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో ఇప్పుడు 100వ చిత్రం చేస్తున్నాను. ఇలా 19 ఏళ్లగా సాగుతున్న సంగీత పయనంలో నాకు అవకాశాలు కల్పిస్తున్న దర్శక నిర్మాతలకు ప్రముఖ నటీనటులకు, సంగీత దర్శకులకు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని పేర్కొన్నారు.
జీవీ ప్రకాశ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment