ఆళ్వార్ పేటలో డెర్మటాలజీ ఎక్స్‌పీరియన్షియల్ సెంటర్
సాక్షి, చైన్నె: చైన్నెలో ప్రపంచంలోనే తొలిసారిగా డాక్టర్ బీ360 డెర్మటాలజీ ఎక్స్‌పీరియన్షియల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆళ్వార్‌పేటలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను శనివారం జరిగిన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అప్సర రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.రాధాకృష్ణన్, ఆదాయపు పన్ను కమిషనర్ నందకుమార్ ప్రారంభించారు. ఇందులో ఆ సెంటర్ వ్యవస్థాపక ఎండీ, డెర్మటాలజిస్ట్ డా. భైరవి సెంథిల్ పాల్గొని డాక్టర్ బి 360 డెర్మటాలజీ ఎక్స్‌పీరియన్షియల్ సెంటర్ సేవలను వివరించారు. అలాగే డెర్మటాలజీకి సంబంధించిన సమగ్ర వివరాలతో బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment