జాతీయ అవార్డు తెచ్చే చిత్రం చేయాలి.!
శరత్‌కుమార్‌తో స్మైల్ మెన్ చిత్ర యూనిట్
తమిళసినిమా: నటుడు శరత్ కుమార్ కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం స్మైల్ మెన్. మ్యాగ్నమ్ మూవీస్ పతాకంపై సాలిల్ దాస్, అనీస్ సరిదా సనత, ఆనందన్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్ – ప్రవీణ్‌ల ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27వ తేదీన తెరపైకి రానుంది. జీఆర్ ఆర్ మూవీస్ సంస్థ దీన్ని తమిళనాడులో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది తాను నటించిన 150వ చిత్రం అని చెప్పారు. కథ అలా ఉంటుంది ఇలా ఉంటుంది సూపర్ హిట్ అవుతుంది అని చెప్పను కానీ ఇది కచ్చితంగా వైవిధ్య భరితంగా ఉంటుందన్నారు. సస్పెన్స్, త్రిల్లర్ జానర్‌లో సాగే ఈ చిత్రంలో తాను ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించినట్లు చెప్పారు. దర్శకులు శ్యామ్, ప్రవీణ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని నటుడిగా 150 చిత్రాలు చేసిన తాను నిర్మాతగా ఒకటి రెండు చిత్రాలే చేశారేమిటని అడుగుతున్నారని, నిర్మాతగా అందుకు తగిన సమయం లేకపోవడమేనని బదులిచ్చారు. తన భార్య రాధిక భారతీయ సినిమాలోని అద్భుత నటి అని, అలాంటి ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టే చిత్రానికి దర్శకత్వం వహించాలని భావిస్తున్నట్లు నటుడు శరత్ కుమార్ చెప్పారు. శరత్ కుమార్ 150వ చిత్రం చేయడం సంతోషంగా ఉందని దర్శక ద్వయం శ్యామ్ ప్రవీణ్ పేర్కొన్నారు కదా చెప్పగానే ఆయన నటించడానికి అంగీకరించారని అదేవిధంగా ప్రతి సన్నివేశంపై ప్రత్యేక దృష్టి పెట్టి నటించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment