తెలుగు లోగిళ్లలో క్రిస్మస్ సంబరాలు
కొరుక్కుపేట: చైన్నె నగరంలో ఉన్న తెలుగు క్రైస్తవ చర్చిలలో క్రిస్మస్ పండుగను కోలాహలంగా, ఆనందోత్సహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. చైన్నె టీపీ సత్రంలో ఆసియా బాప్టిస్టు పాస్టర్స్ సహవాసం, మెర్సీ అండ్ ట్రూత్ ఉమెన్స్ ఫెలోషిప్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు చిన్నారులతో కలసి ఘనంగా జరుపుకున్నారు. రెవరెండ్.డాక్టర్.ఎస్.ప్రకాష్ రాజ్, డయానా రోజ్ దంపతుల నేతత్వంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులకు పాటలతో, నృ త్యాలతో ఆకట్టుకున్నారు. యేసు క్రీస్తు మానవాళి శ్రేయస్సు కోసం భూమి మీదకు వచ్చారని, ప్రతీ ఒక్కరూ దేవివునిపై విశ్వాసం ఉంచి మంచి మార్గంలో నడవాలి అని రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు.
ఐనావరం రక్షణ సైన్యం ఆధ్వర్యంలో..
చైన్నె ఐనావరంలోని సాల్వేషన్ ఆర్మీ(రక్షణ సైన్యం)లో క్రిస్మస్ పండుగను కోలాహలంగా జరుపుకున్నారు. చర్చి కాపరి క్రీస్తు పట్టిన రోజు, ఆయన లోకానికి వచ్చిన విశేషాలతో దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ పాటలతో చిన్నారులు,కెరల్స్ బందాలు ఆకట్టున్నారు.
వేపరిలోని ఎంసీటీబీసీలో..
చైన్నె వేపెరిలోని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ ఆరాధనలు బుధవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు జి.రామయ్య, సెక్రెటరీ పోతల ప్రభుదాసు, కోశాధికారి ఐ.మార్క్ ల నేతృత్వంలో జరిగిన వేడుకల్లో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ దైవ సందేశాన్ని అందించి ఆశీర్వదించారు.
టీ.నగర్‌లో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, చైన్నె: టీ.నగర్‌లో అన్నాడీఎంకే ఎంజీయార్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పేదలకు సహాయకాలను పంపిణీ చేశారు. పాస్టర్‌లు డేవిడ్, వివేక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పిల్లలకు బహుమతులను, పేదలకు సహాయకాలను అందచేశారు. డాక్టర్ అమర్ షరీఫ్, ప్రొఫసర్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నాయకులు హరిబాబు,పద్మనాభన్, జయరామన్, సూర్యకళ, తేన్‌మొళి, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment