కొరుక్కుపేట: ఉత్తర చైన్నెలోని కోరుకుపేట, పెరంబూర్ సహా ప్రాంతాల్లో పైపులైన్లు, ట్యాంకర్ లారీల ద్వారా నీటి సరఫరా జరుగుతుండగా పలు వీధుల్లో పైపులైన్లు లేకపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రతి అర్ధగంట, గంటకు 7.1 మిలియన్ లీటర్ల నీరు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇది సరిపోక పోవడంతో ఆ ప్రాంత ప్రజలు తాగునీటి కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో ఉత్తర చైన్నె డెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా కొరుక్కుపేట, పెరంబూర్ ప్రాంతంలో (వార్డులు 38,41,47) కొత్త తాగునీటి పైపుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. దీని ద్వారా రోజుకు 13 మిలియన్ లీటర్ల తాగునీటిని పంపిణీ చేయవచ్చు. దీని ద్వారా 25,671 ఇళ్లకు లబ్ధి చేకూరనుంది. దాదాపు లక్షా 28 వేల మందికి అదనంగా నీరు అందనుంది. దీంతో ఆ ప్రాంతంలో నీటి కొరత తీరుతుంది. వచ్చే ఏడాది ఆగస్టు నెలలో ఈ కొత్త తాగునీటి పైపులు వేసే పనులను రూ.19.4 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 2.4 కిలోమీటర్ల మేర పైపులు వేస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక వచ్చే ఏడాది ఆగస్టు నుంచి రోజూ గంటపాటు నీటి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment