గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కాంబో రిపీట్
తమిళసినిమా: నటుడు అజిత్ కు ఒక పాలసీ ఉందని చెప్పవచ్చు. ఈయన ఒక దర్శకుడితోనో, నిర్మాతతోనో చిత్రం చేస్తే , వారితో మంచి ర్యాపో కుదిరితే మళ్లీ మళ్లీ చిత్రాలు చేస్తారు. అలా దర్శకుడు శివ దర్శకత్వంలో వీరం,వివేకం, విశ్వాసం చి త్రాలు చేసిన అజిత్ నిర్మాత ఏఎం.రత్నం బ్యా నర్‌లో ఆరంభం, ఎన్నై అరిందాల్ చిత్రాలు చేశారు. ఇకపోతే ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం విడాముయ ర్చి పొంగల్ సందర్భంగా తెరపైకి రానుంది. అదేవిధంగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం చేస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూ టింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తు తం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రా న్ని సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా నటుడు అజిత్ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌తో మరో చిత్రం చేయడానికి పచ్చ జెండా ఉపారన్నది తాజా సమాచారం. విశేషం ఏమిటంటే నటుడు అజిత్‌నే మరో చిత్రం చేద్దామని చెప్పినట్లు సమాచారం. కాగా దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత విశాల్ కథానాయకుడిగా మార్క్ ఆంటోనీ చిత్రానికి సీక్వెల్ చేయనున్నారట. ఆ తరువాత అజిత్ హీరోగా చిత్రం చేయనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదేవిధంగా విడాముయర్చి చిత్రం తరువాత నటుడు అజిత్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చిత్రం చేస్తారని సమాచారం. కాగా వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు మంగాత్తా వంటి హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.
అజిత్‌తో ఆదిక్ రవిచంద్రన్
Comments
Please login to add a commentAdd a comment