ట్రాఫిక్ ఐలాండ్‌కు బాలచందర్ పేరు
సాక్షి, చైన్నె: చైన్నె లజ్ చర్చ్ రోడ్డులోని ట్రాఫిక్ ఐలాండ్‌కు సినీ ప్రఖ్యాత దర్శకుడు దివంగత కె.బాలచందర్ పేరు పెట్టారు. ‘దర్శక శిఖరం కె. బాలచందర్ ట్రాఫిక్ ఐలాండ్’ అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించిన బోర్డును గురువారం నగరాభివృద్ధి శాఖమంత్రి కేఎన్ నెహ్రూ ఆవిష్కరించారు. మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్‌లోని తేనాంపేట జోన్ పరిధిలోని 123వ వార్డులోని లజ్ చర్చ్ రోడ్డు – కావేరి ఆస్పత్రి వద్ద ఉన్న ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఈ బోర్డును ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, మైలాపూర్ ఎమ్మెల్యే వేలు, డిప్యూటీ మేయర్ ఎం.మహేష్‌కుమార్, తమిళనాడు హౌసింగ్ బోర్డు చైర్మన్ ఎస్.మురుగన్, కమిషనర్ కుమార గురుబరన్, బాలచందర్ కుమార్తె పుష్ప, సినీ ప్రముఖులు ఎస్వీ శేఖర్, శ్రీరాజేష్, వి.బాబు, మహ్మద్ ఇలియాస్, కలైమామణి పూవిళంగు మోహన్, దాశరథి, విక్రమన్, పేరరసు, చరణ్, మంగై అరిరాజన్, శివన్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.
ధైర్యంగా ముందుకు రండి..!
● అన్నావర్సిటీ ఘటనపై కమిషనర్ అరుణ్
సాక్షి, చైన్నె: ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా బెదిరిస్తున్నా యువ తులు, విద్యార్థినులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చైన్నె పోలీసు కమిషనర్ అరుణ్ సూచించారు. అన్నావర్సిటీ ఘటనలో తమకు ఫిర్యాదు అందగానే వెంటనే విచారణ వేగవంతం చేసి మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. ఈ ఘటన గురించి గురువారం రాత్రి కమిషనర్ అరుణ్ మీడియాతో మాట్లాడారు. అన్నావర్సిటీలో 70 సీసీ కెమెరాలు ఉన్నాయని, ఇందులో 50 పని చేస్తున్నాయని వివరించారు. అలాగే, ఇక్కడ మాజీ సైనికులు 140 మంది సెక్యూరిటీగా మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇక్కడ మొత్తం ఆరు ప్రధాన మార్గాలతో పాటు 11 గేట్లు ఉన్నాయని, ఎక్కడెక్కడ ప్రహరీ ఎత్తు తక్కువగా ఉందో పరిశీలిస్తున్నామన్నారు. బాధితురాలి నుంచి తమకు ఫిర్యాదు అందగానే అనుమానితులు అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించామని, ఇందులో జ్ఞానశేఖర్ నిందితుడిగా తేలిందన్నారు. పోక్సో, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల కేసుల్లో తమ వెబ్‌సైట్‌లో బీఎన్‌ఎస్ చేస్తామని, ఇది ఆటోమేటిక్‌గా లాక్ కావడంలో జాప్యాన్ని అస్త్రంగా చేసుకుని ఎవరో ఎఫ్‌ఐఆర్‌ను చూసి డౌన్‌లోడ్ చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, ఫిర్యాదుదారుకు సైతం ఓ కాపీ ఇచ్చానన్నారు. ఈ లీక్‌పై కేసు నమోదు చేశామని, దీనిపై విచారణ జరుగుతుందని అన్నారు. లీక్ చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఒకే ఒక నిందితుడు మాత్రమే ఉన్నాడని, మా సార్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తమకు పార్టీ లతో సంబంధం లేదని, నేరం చేసిన వారెవరైనా సరే వదలి పెట్టమన్నారు. విచారణపై బాధితులు సంతృప్తిని వ్యక్తం చేశారని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
90 ఏళ్ల వృద్ధుడిపై పోక్సో కేసు
సేలం: 90 ఏళ్ల వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైలాడుదురై జిల్లా తరంగంపాడి తాలూకా, ముత్తువడుగవిచ్చియూర్ గ్రామానికి చెందిన నారాయణస్వామి (90). ఇతను అదే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికను కంటిలో మందు వేయడానికి ఇంటికి పిలిచాడు. వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించినట్టు తెలిసింది. విషయంగా ఆ బాలిక తల్లి మైలాడుదురై మహి ళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ సుగంధి నారాయణస్వామిని అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు లో హాజరుపరిచి తిరుచ్చి జైలుకు తరలించారు.
నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
సేలం: నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పుదుకోట్టై జిల్లా గంధర్వకోట యూనియన్ ఆత్తంగరై విడుది గ్రామానికి చెందిన గణేషన్ కుమారుడు అశ్విన్ (12), అదే ప్రాంతానికి చెందిన పళనివేల్ కుమారుడు భువనేశ్వరన్ (9) స్నేహితులు. అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో అశ్విన్ 5వ తరగతి, భువనేశ్వరన్ రెండో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు పాఠశాలలకు సెలవులు కారణంగా ఇంట్లో ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన ముత్తుకుమరన్ అనే వ్యక్తి కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద ఆరు అడుగుల లోతులో పెద్ద గుంత తవ్వారు. ఆ ఇంటి వద్ద గురువారం ఉదయం ఆడుకుంటున్న అశ్విన్, భువనేశ్వరన్ ప్రమాదవశాత్తు గుంతలో పడి నీటిలో మునిగి మృతిచెందారు. కరంబకుడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తర లించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment