రోడ్డు భద్రతే లక్ష్యం
● ఒడిశా ప్రభుత్వంతో ఐఐటీ మద్రాసు ఒప్పందం
సాక్షి, చైన్నె: రోడ్డు భద్రతే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వంతో ఐఐటీ మద్రాసు ఆర్‌బీజీ ల్యాబ్స్ భాగస్వా మ్య ఒప్పందం కుదుర్చుకుంది. వివరాలను గురువారం ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్‌పై ఈ సహకారం ఉంటుందని, ఒడిశాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా కార్యాచరణలు ఉంటాయని ప్రకటించారు. ఈసహకారానికి సంబంధించి భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర రవాణా మంత్రి బిభూతి భూషణ్ జెనా నేతృత్వంలో రెండు రోజుల క్రితం ఒప్పందాలు జరిగినట్టు పేర్కొన్నారు. ఈచొరవ గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ విపత్తు నిర్వహణ అనేది దేశానికి సంబంధించిన ఎజెండాలో చాలా ఉన్నతమైనదన్నారు. రోడ్డు భద్రత అనేది పౌరుల శ్రేయస్సు, దేశ సామా జిక–ఆర్థిక అభివృద్ధిని నేరుగా ప్రభావితం చేసే అత్యవసర, క్లిష్టమైన సవాలుగా వివరించారు. ఐఐటీ మద్రాస్‌లో రోడ్డు భద్రతకు సంబంధించిన సంక్లిష్టతలను పరిష్కరించడానికి వినూత్నమైన, సాంకేతికతతో నడిచే పరిష్కారాలపై అవిశ్రాంతంగా కృషిచేస్తున్నామన్నారు. యాక్సిడెంట్ హాట్‌స్పాట్‌లను గుర్తించడం, అధునాతన క్రాష్ ఇన్వెస్టిగేషన్ టూల్స్ అభివృద్ధి చేయడం నుంచి సమర్థవంతమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌లను రూపొందించడం వరకు తమ ప్రయత్నాలు స్థిరంగా ప్రాణాలను రక్షించడం, గాయాలను నివారించడం లక్ష్యంగా ఉంటాయని వివరించారు. తమిళనాడు, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రం సహా అనేక రాష్ట్రాల్లో ఈ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment