విజయానందంలో విడుదలై –2 చిత్ర యూనిట్
తమిళసినిమా: దర్శకుడు వెట్రిమారన్ చిత్రాలు పూర్తిగా వైవిధ్యభరితంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈయన చిత్రాల్లో కమర్షియల్ అంశాలు ఉంటూనే సమకాలీన రాజకీయాలు పుష్కలంగా చోటు చేసుకుంటాయి. అలా ఈయన గత ఏడాది తెరకెక్కించిన చిత్రం విడుదలై. హాస్యనటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, నటుడు విజయ్ సేతుపతిని ముఖ్యపాత్రలో నటింపజేసిన ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్ ఇన్ఫోటెయిన్ మెంట్ పతాకంపై ఎల్ రెడ్.కుమార్ నిర్మించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా దర్శకుడు వెట్రిమారన్ తాజాగా దానికి సీక్వెల్ గా విడుదలై – 2 ను రూపొందించారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు, కాగా తొలిపాకంలో నటుడు సూరి పాత్రను ప్రధానంగా చూపించిన దర్శకుడు వెట్రిమారన్ రెండవ భాగంలో నటుడు విజయ్ సేతుపతి పాత్రను ప్రధానంగా చూపించారు. డిసెంబర్ 20న తెరపైకి వచ్చిన విడుదలై 2 చిత్రం మంచి టాక్‌తో థియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్రం పాజిటివ్ రిపోర్ట్స్‌తో ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చైన్నెలో విజయోత్సవ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచి విజయాన్ని అందించిన దర్శకుడు వెట్రిమారన్ ను చిత్ర నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ గజమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో యూనిట్ సభ్యులు పాల్గొని విడుదలై – 2 చిత్ర విజయాన్ని సంతోషంగా ఆస్వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment