ఆ నటిని కొట్టారా?
దర్శకుడు బాలా
తమిళసినిమా: దర్శకుడు బాల బాణి వేరేగా ఉంటుంది. దర్శక పర్ఫెక్ట్ నిస్ట్ అంటారు. బాల చిత్రాలు నిర్మాణంలో జాప్యం కావడానికి ఇదొక కారణం అని చెప్పవచ్చు. సన్నివేశాలు తాను అనుకున్న విధంగా వచ్చే వరకు కాంప్రమైజ్ కాని దర్శకుడు ఈయన. అదేవిధంగా బాల చిత్రాలు ఇతర దర్శకులకు పూర్తి భిన్నంగా ఉంటాయి. సేతు, పితామగన్, నంద, నాన్ కడవుల్, పరదేశి వంటి చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. కాగా తాజాగా బాల దర్శకత్వం వహించిన చిత్రం వణంగాన్. ఈ చిత్రంలో ముందు నటుడు సూర్య కథానాయకుడిగా కమిట్ అయ్యారు. నటి కృతిశెట్టి నాయకిగా, చెల్లెలి పాత్రలో ప్రేమలు చిత్రం ఫ్రేమ్ మమిత బైజు ఎంపికయ్యారు. చిత్ర షూటింగ్ కొంత భాగం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల సూర్య చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తర్వాత నటి కృతిశెట్టి, అదే విధంగా మమిత బైజులు కూడా వణంగాన్ చిత్రం నుంచి ఒక్కొక్కరు వైదొలిగారు. వీరిలో నటి మమిత బైజు వ్యవహారం మాత్రమే చర్చనీయాంశంగా మారింది. కారణం ఆమె చిత్రం నుంచి వైదొలగిన తరువాత దర్శకుడు బాల తనను కొట్టారని, అందుకే తాను చిత్రం నుంచి తప్పుకున్నట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఈ అంశం కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి చేసింది. అయితే ఆ తర్వాత నటి మమిత బైజు ప్లేటు ఫిరాయించింది. తన వ్యాఖ్యలను వక్రీకరించారని తాను చెప్పింది పూర్తిగా కాకుండా కొంతనే మీడియా ప్రచారం చేసిందని ఆరోపించింది. దర్శకుడు బాల తన కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పుకొచ్చింది. నిజంగా ఆ చిత్రంలో తనకు ఎలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదని, దర్శకుడు బాల తనను కూతురులా చూసుకున్నారని పేర్కొంది. కాగా ఈ సంఘటన జరిగిన చాలాకాలం తర్వాత ఇటీవల దర్శకుడు బాల ఈ వ్యవహారంపై స్పందించారు ఒక భేటీలో ఈయన పేర్కొంటూ ఎందుకు మేకప్ వేసుకున్నావు అని మాత్రమే తాను కొట్టేలా నటి మమిత బైజు పై చెయ్యి పైకి ఎత్తానని, దీంతో తాను ఆమెను కొట్టినట్లు ప్రచారం జరిగిందని చెప్పారు. మమితాబైజు తన కూతురు లాంటిదని , అయినా ఒక మహిళను ఎవరన్నా కొడతారా అని అన్నారు.
నటి మమితా బైజు
దర్శకుడు బాల
Comments
Please login to add a commentAdd a comment