సముదాయ భవనం ప్రారంభం
తిరువళ్లూరు: చోళవరం యూనియన్‌లో సుమారు రూ.49 లక్షల వ్యయంతో నిర్మించిన సముదాయ భవనాన్ని రాష్ట్ర ఆదిద్రావిడ సంక్షేమశాఖ మంత్రి మదివేందన్, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ ప్రారంబించారు. వివరాలు..తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ కుమ్మనూరు గ్రామాంలో సుమారు 49.90 లక్షల వ్యయంతో సముదాయ భవనాన్ని నిర్మించారు. ప్రారంభం సందర్భంగా మంత్రి మదివేందన్ మాట్లాడుతూ డీఎంకే అధిఆకారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత అంబేడ్కర్‌కు కలలను సాకారం చేసేలా పని చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత 570 కోట్ల సార్లు మహిళలు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సులో ప్రయాణం చేశారని గుర్తు చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రతినెలా నిరుపేద మహిళలకు వెయ్యి రూపాయలు, నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ప్రతి నెలా వెయ్యి అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభుశంకర్, పొన్నేరి ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment