సెప్టింక్ ట్యాంక్‌లో పడి బాలిక మృతి
● పాఠశాల రిజిస్ట్రార్‌తో పాటూ ముగ్గురి అరెస్టు
ఆందోళన నిర్వహిస్తున్న ఈకాడు గ్రామస్తులు
సేలం : విక్రవాండిలో పాఠశాల ప్రాంగణంలో ఉన్న సెప్టింక్ ట్యాంక్‌లో పడి బాలిక మృతి చెందిన కేసులో పాఠశాల రిజిస్ట్రార్, ప్రిన్సిపల్, టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. విల్లుపురం జిల్లా విక్రవాండిలో పాత పోలీసు స్టేషన్ వీధికి చెందిన పళనివేల్ (34), అతని భార్య శివశంకరి. వీరి పెద్ద కుమార్తె లియో లక్ష్మి (3). ఈమె విక్రవాండిలో ఉన్న సెయింట్ మేరిస్ మెట్రిక్యులేషన్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. బాలిక శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల ప్రాంగణంలో ఉన్న సెప్టింక్ ట్యాంక్‌లో పడి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలలో సెప్టింక్ ట్యాంక్‌లో పడిన బాలికను పాఠశాల నిర్వాహకులు, టీచర్లు బయటకు తీసి, ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాల రిజిస్ట్రార్ ఎమల్డా, ప్రిన్సిపల్ డేమియా మేరి, ఉపాధ్యాయురాలు ఏంజిల్‌ను అరెస్టు చేశారు. తర్వాత వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఎమల్డా, డేమియా మేరికు తీవ్ర రక్తపోటు ఏర్పడి, రక్తపు వాంతులు కావడంతో అదే ఆస్పత్రిలో చికిత్సకు చేర్చారు. ఉపాధ్యాయురాలు ఏంజిల్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు గీతాంజలి ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులు శవపంచనామా నిర్వహించారు. అప్పుడు శవపంచనామా ప్రక్రియలను వీడియోలో నమోదు చేశారు. అనంతరం బాలికను కుటుంబీకులకు అప్పగించా రు. కాగా కాతి చెందిన చిన్నారి కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. 3 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రి పొన్ముడి శనివారం ఆ చెక్కును చిన్నారి కుటుంబానికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment