దుకాణాల అద్దైపె సమీక్షించాలని వ్యాపారుల వినతి
వేలూరు: వేలూరు ప్రధాన తపాలా కార్యాలయం నుంచి సీఎం స్టాలిన్‌కు వేలూరు జిల్లా అన్ని వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు జ్ఞానవేల్ అధ్యక్షతన వినతి పత్రం పంపారు. ఈ వినతి పత్రంలో సీఎం స్టాలిన్ మంత్రిగా పనిచేసిన కాలంలో ఒక సారి మాత్రం దుకాణాల పేర్లు మార్పు చేసుకునేందుకు చట్టాలను తీసుకొచ్చారని అయితే దుకాణం పేరు మార్పులు, చేర్పులు చేసుకునే చట్టాన్ని నిలుపుదల చేశారన్నారు. 12 మాసాల దుకాణం అద్దెను ఒకే సారి చెల్లించాలని చట్టాలను చేయడం సరికాదన్నారు. నూతనంగా దుకాణాలు ప్రారంభించేందుకు పలు నిబంధనలు పెట్టడాన్ని మార్పు చేయాలని, సంవత్సరాల తరబడి వ్యాపారాలపై ఆధార పడి జీవిస్తున్న వ్యాపారులపై చట్టాల పేరుతో వేధింపులకు గురి చేయడం సరికాదని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం పంపిన వారిలో అన్ని వ్యాపారుల సంఘం జిల్లా యువజన విభాగం కార్యదర్శి అరుణ్‌ప్రసాద్, శరవణన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment