కేంద్ర వ్యవసాయ శాఖతో ఐఐటీ మద్రాసు భాగస్వామ్యం
సాక్షి, చైన్నె: కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి ఐఐటీ మద్రాస్ వ్యవసాయం, అనుబంధ రంగాలలో స్టార్ట్–అప్‌ల గురించిన సమాచారంతో విస్టార్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచనుంది. అలాగే స్టార్ట్–అప్‌లు కలిగి ఉన్న సామర్థ్యాలను గురించి రైతులు తెలుసుకోవడం , వాటిని యాక్సెస్ చేయడం లక్ష్యంగా భాగస్వామ్యమైంది. వ్యవసాయ వనరులను యాక్సెస్ చేయడానికి వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ (వీఐఎస్‌టీఏఏఆర్) వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహద పడే రీతిలో ఈ ఒప్పందాలు జరిగాయి. కొత్త ఉత్పత్తులు, సేవలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించే వారి ఆవిష్కరణలు, సామర్థ్యాల మీద దృష్టి పెట్టనున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఐఐటీ మద్రాస్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం గురించి గురువారం ఐఐటీ వర్గాలు ప్రకటించాయి. ఐఐటీ మద్రాస్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ హెడ్ ప్రొ. తిల్‌లై రాజన్ మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తుందన్నారు. అందుకే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి స్టార్టప్‌లకు ముఖ్యమైన పాత్ర దక్కిందన్నారు. ఆ దిశగా ఐఐటీ మద్రాస్‌లోని స్టార్టప్‌లు రిస్క్ ఫైనాన్సింగ్‌పై సెంటర్ ఫర్ రీసెర్చ్ అభివృద్ది చేయనున్నట్టు వివరించారు. వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శామ్యూల్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్టార్టప్‌ల వినూత్న సాంకేతికతలు వ్యవసాయాన్ని స్థిరంగా, వాతావరణాన్ని తట్టుకోగలిగేలా చేయడంలో దోహదపడతాయన్నారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా డిజిటలైజేషన్ విస్తరణను గణనీయంగా విస్తృతం చేయడం, ప్రతి రైతు పంట, ఉత్పత్తి, మార్కెటింగ్, విలువ, సరఫరా నిర్వహణ వంటి అంశాలలో సేవలు సులభతరం చేయడానికి వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాసు,కేంద్ర ప్రభుత్వ వర్గాలు సెల్వం, డి. డేవిడ్ రాజ్‌కుమార్, డా. సంజయ్ కుమార్, సజిత్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment