నమ్మ ఊరు తిరువిళా..
సాక్షి, చైన్నె: సంక్రాంతి సందర్భంగా చైన్నెలో నమ్మ ఊరు తిరువిళాకు ఏర్పాట్లు చేపట్టారు. ఈనెల14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటూ రాష్ట్ర సమాచార , ప్రసారాల శాఖ పరిధిలోని కళల విభాగం నేతృత్వంలో ఈ వేడుకలకు నిర్ణయించారు. 1,500 మంది కళాకారులు ఈ వేడుకలలో గ్రామీణ వాతావరణా న్ని చైన్నెలోకి తీసుకొచ్చే రీతిలో కళా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. బీసెంట్, ఎలియాట్స్, తిరువాన్మీయూరు బీచ్‌లలో, గిండి కత్తి పారా స్క్వయర్, సైదాపేట కార్పొరేషన్ మైదానం, టీనగర్ నటేషన్ పార్కు, , నుంగంబాక్క క్రీడా మైదానం, ఎగ్మూర్ మ్యూజియం, రాయపురం రాబిన్సన్ పార్కు, పెరంబూరు మురసోలి మారన్ పార్కు తదతర 18 ప్రాంతాలలో నమ్మవూరు తిరువిళా గ్రామీణ వాతావరణం ఉట్టి పడే విధంగా నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను సీఎం స్టాలిన్ ఈనెల 13వ తేదీ సాయంత్రం కీల్పాకం పార్కులో ప్రారంభించనున్నారు. అలాగే సంక్రాంతి సందర్భంగా చైన్నె, పొల్లాచ్చి, మదురైలో ఈనెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంతర్జాతీయ స్థాయి బెలూన్ల ప్రదర్శనకు ఓ సంస్థతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీ కార్యాలయంలోకి కుష్బు
సాక్షి, చైన్నె : పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సినీ నటి కుష్బు గురువారం బీజేపీ కార్యాలయంలో అడుగు పెట్టారు. సమావేశ మందిరంలో అన్నావర్సిటీ వ్యవహారంపై, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిసూ ప్రెస్‌మీట్ సైతం పెట్టారు. అన్నామలై బీజేపీ అధ్యక్షుడైన తర్వాత కుష్బు పార్టీ కార్యక్రమాలకు క్రమంగా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, పార్టీ తనను దూరం పెట్టిందని, తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదని ఆమె తీవ్ర ఆవేదనను వ్యక్తంచేశారు. ఈ పరిస్థితులలో బీజేపీ కార్యాలయం నుంచి ఆమె కు పిలుపు ఇచ్చినట్లుంది. దీంతో కమలాలయానికి చేరుకున్నారు. బీజేపీ మహిళా మోర్చా వర్గాలతో కలిసి ప్రెస్‌మీట్ సైతం పెట్టారు.
యువజన విభాగం అధ్యక్షుడిగా ముకుందన్
సాక్షి, చైన్నె : పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా ముకుందన్ ఉంటారని, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. పీఎంకే యువజన నేతగా ముకుందన్‌ను ని యమిస్తూ రాందాసు చేసిన ప్రకటన ఆ పార్టీ ఎగ్జి క్యూటివ్ కౌన్సిల్ మీట్‌లో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. గతంలో తాను వహించిన పదవిని తన మేనళ్లుడికి అప్పగించడాన్ని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు వ్యతిరేకించారు. ఈ వ్యవహారం రాందాసు, అన్బుమణి మధ్య వివాదానికి దారి తీసింది. చివరకు పార్టీ ముఖ్య నేతలు జోక్యంచేసుకుని సయోధ్య కుదిర్చారు. ఈ పరిస్థితుల్లో ముకుందన్ తనకు పదవి వద్దే వదని తేల్చి చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది. అయితే పీఎంకే యువజన అధ్యక్షుడిగా ముకుందన్ బాధ్యతలు స్వీకరించినట్టే అని గురువారం రాందాసు స్పష్టం చేశారు. ఆయన తైలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ముకుందన్ నియామకం జరిగిందని, పార్టీ యువజన అధ్యక్షుడు ఆయనే అని స్పష్టం చేశారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారంలో కూర్చుని మాట్లాడుకున్నామని, ఇది ముగిసిన చర్చ అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్భుమణితో ఎలాంటి అభిప్రాయ భేదాలులేవని, అన్నీ సర్దుకున్నాయని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment