అన్నానగర్: చైన్నె సెమ్మొళి పార్క్ ఫ్లవర్ ఎగ్జిబిషనన్‌ను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ జనవరి 2న ప్రారంభించనున్నారు. చైన్నెలోని అన్నా మెంపాలెంలోని డాక్టర్ రాధాకృష్ణన్ రోడ్‌లో 8 ఎకరాల విస్తీర్ణంలో సెమ్మొళి పూంగా (ఫ్లవర్ షో)ను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే నగరం నడిబొడ్డున ఉన్న ఈ పార్కును 2010న ముఖ్య మంత్రిగా ఉన్న దివంగత కరుణానిధి ప్రారంభించారు. ఊటీ బొటానికల్ గార్డెన్ లాగా ఏర్పాటు చేసిన ఈ పార్కులో దాదాపు 800 రకాల మొక్కలను పెంచి సంరక్షిస్తున్నారు. అరుదైన జాతుల చెట్లు కూడా ఉన్నాయి. ఊటీ లాగానే ఇక్కడ కూడా ఫ్లవర్ కనుల ప్రదర్శన జరుగుతుంది. ఊటీలో జరిగే ఫ్లవర్ ఫెయిర్‌కు వెళ్లలేని వారికి ఈ పార్క్ ఓ వరం. పూసి దొర్లే పూలతో ఈ ఏడాది ఫ్లవర్ ఫెయిర్ కోసం సెమ్మొళి పార్క్ ముస్తాబవుతోంది. గతేడాది 10 రోజుల పాటూ జరిగిన పూల జాతరను లక్షలాది మంది వీక్షించారు. గతేడాది ప్రజలు ఇచ్చిన అత్యుత్సాహంతో ఈ ఏడాది పూల జాతరను రకరకాల పూలతో అలంకరించనున్నారు. ఇందుకోసం తమిళనాడు ఉ ద్యానవన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ కోసం కోయంబత్తూరు, ఊటీ, కృష్ణగిరి, హోసూరు, కొడైకెనాల్, కన్యాకుమారి, మదురై ప్రాంతాల నుంచి అరుదైన పుష్పాలను తీసుకొచ్చి ప్రదర్శనలో వినియోగించారు. పెటుని యాస్, గులాబీలు, తులి ప్స్, జిన్నియాస్, లిల్లీ స్, మేరీగోల్డ్స్ ప్రదర్శనలో ఉన్నాయి. వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ నుంచి దాదాపు 30 లక్షల పూలు తెప్పించారు. హోసూరు నుంచి ప్రత్యేకంగా గులాబీ మొక్కలను తీసుకొచ్చారు. రాబోయే 2వ ఫ్లవర్ ఎగ్జిబిషనన్‌ను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రారంభించి, సందర్శిస్తారు. పూల ప్రదర్శన జనవరి 18 వరకు కొనసాగుతుంది. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పుష్ప ప్రదర్శనను సందర్శించవచ్చు. ఫ్లవర్ షో చూసేందుకు వచ్చే పెద్దలకు గతేడాది మాదిరిగానే రూ.150 ఫీజుగా నిర్ణయించారు. మైనర్లకు రూ.75, వీడియో, ఫొటో కెమెరాలు తీసుకెళ్లే వారికి రూ.500 ఫీజుగా నిర్ణయించారు. సాయంత్రం ఆర్ట్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్లవర్ ఎగ్జిబిషన్ పనులను ముమ్మరం చేశారు. ఫలితంగా సాధారణ ప్రజలను పార్కులోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు.
● జనవరి 2న సెమ్మొళి పార్క్ ఫ్లవర్ షో ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment