తిరువళ్లూరులో 35 లక్షల మంది ఓటర్లు
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35లక్షల 31వేల 45 మంది ఓటర్లు ఉన్నట్టు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ తెలిపారు. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని అర్హతగా తీసుకుని నూతన ఓటర్ల జాబితాను తయారు చేసి సోమవారం ఉదయం రాజకీయ పార్టీలకు చెందిన నేతల సమక్షంలో కలెక్టర్ విడుదల చేశారు. మొత్తం 1,49,400 నూతన వినతులు రాగా వీటిలో 1,46,083 వినతులను అంగీకరించి మిగిలిన 3317 వినతులను తిరస్కరించారు. దీని ప్రకారం నూతన ఓటర్లుగా 1.46 లక్షల మంది చేరినట్టు కలెక్టర్ తెలిపారు. పది అసెంబ్లీ నియోజవర్గాలలో 1315 పాఠశాలల్లో 3699 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. నూతన ఓటర్లు జాబితా ప్రకారం గుమ్మిడిపూండిలో 330 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,81,889 మంది ఓటర్లు ఉండగా పొన్నేరి(రిజర్వుడు) అసెంబ్లీ స్థానంలో 313 పోలింగ్ బూత్‌లలో 2,68,050 మంది ఓటర్లు ఉన్నారు. తిరుత్తణి నియోజకవర్గంలో మొత్తం 330 బూత్‌లు ఉండగా 2,80,706 మంది ఓటర్లు ఉన్నారు. తిరువళ్లూరులో 296 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,70,662 మంది ఓటర్లు ఉన్నారు. పూందమల్లి(రిజర్వుడు) స్థానంలో 397 బూత్‌లు ఉండగా 3,86,823 మంది ఓటర్లు ఉన్నారు. ఆవడిలో 457 పోలింగ్ బూత్‌లు, 4,60,408 మంది ఓటర్లు ఉన్నారు. మధురవాయల్‌లో 440 పోలింగ్ బూత్‌లు, 4,41,669 మంది ఓటర్లు ఉన్నారు. అంబత్తూరులో 350 పోలింగ్ బూత్‌లలో 3,68,652 మంది ఓటర్లు వున్నారు. మాధవరం నియోజకవర్గంలో 475 పోలింగ్ బూత్‌లు ఉండగా 486536 మంది ఓటర్లు ఉన్నారు. తిరువొత్తియూర్‌లో 311 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,85,656 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తానికి తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలో 3699 పోలింగ్ బూత్‌లు వుండగా 17,38,395 మంది పురుషులు, 17,91,863 మంది సీ్త్రలతోపాటు మొత్తం 3531045 మంది ఓటర్లు ఉన్నట్టు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ తెలిపారు. ఓటర్లు లిస్టులో పేర్లు మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులు ఉంటే రాత పూర్వకంగా చేయాలని కూడా కోరారు.
ఓటర్ల జాబితా విడుదల
వేలూరు: వేలూరు జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రత్యేక ఓటర్ల జాబితాను కలెక్టర్ సుబ్బలక్ష్మి సోమవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 6,31,216 మంది పురుషులు, 6,78,153 మంది మంది మహిళలతో కలిపి మొత్తం 13,09,369 ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వేలూరు జిల్లాలోని గుడియాత్తం, కేవీ కుప్పం, వేలూరు, కాట్పాడి, అనకట్టు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాను విడుదల చేశామన్నారు. డీఆర్‌ఓ మాలతి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుతిరుత్తణి ఓటర్లు 2,80,706 మంది
తిరుత్తణి: తిరుత్తణి నియోజకవర్గంలో 2,80,706 మంది ఓటర్లు ఉన్నట్లు తుది ఓటర్ల జాబితా విడుదల చేసి ఆర్డీఓ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తుది ఓటర్ల జాబితా సోమవారం విడుదలైంది. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ దీప తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఇందులో పురుష ఓటర్లు 1,38,048, మహిళా ఓటర్లు 1,42,626, ఇతరులు 32 సహా 2,80,706 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటర్ల జాబితా పరిశీలన కోసం తహసీల్దారు కార్యాలయం, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీల్లో ఉంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment