ఇద్దరు చిన్నారులకు కుక్క కాటు
తిరువొత్తియూరు: రామనాథపురం జిల్లా తొండి పట్టణ పంచాయతీలో వీధి కుక్కలు కరవడంతో ఇద్దరు బాలురకు, ఒక వృద్ధుడికి గాయాలయ్యాయి. తొండి పట్టణ పంచాయతీలో 20 వేలకు పైబడిన వారు నివాసం ఉంటున్నారు. తొండి పరిసర ప్రాంతంలో 50కి పైబడిన సముద్ర తీర గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ప్రజలు చేపలు పడుతుంటారు. ఈ ప్రాంతంలో రోజురోజుకు వీధి కుక్కలు బెడద ఎక్కువగా కనబడుతోంది. ఈ క్రమంలో సోమ వారం ఉదయం తొండి లేప్పన్ వీధికి చెందిన మూడో తరగతి చదువుతున్న విద్యార్థి, విల్లా వీధికి చెందిన మనసిర్ కుమారుడు 5 జాలరి వీధికి చెందిన వృద్ధుడు అనే ముగ్గురు ఆ మార్గంలో వెళ్తుండగా కుక్కలు వారిపై దాడి చేసి కరిచాయి. దీంతో వారికి గాయాలయ్యాయి. తొండి పట్టణ పంచాయతీలో కుక్కలను అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు.
డ్రగ్స్‌తో వ్యక్తి అరెస్ట్
తిరువొత్తియూరు: కోవైలో 8 హత్య కేసుల్లో సంబంధం ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ. 2.50 లక్షలు విలువచేసే మెతబెటమైన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోవై, రత్నపురి పోలీసులు ఆదివారం గస్తీ చేస్తున్నారు. ఆ సమయంలో లక్ష్మీపురం టెక్‌టాక్స్ ఆఫీసు వంతెన వద్ద అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ఒకరిని పట్టుకుని పోలీసులు విచారణ చేశారు. అతని వద్ద ఉంచి రూ.2.5 లక్షల విలువ కలిగిన 2.5 గ్రాముల మెత్తబెట్టమైన్ అనే మత్తు పదార్థం ఉన్నట్టు తెలిసింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేయబడిన వ్యక్తి తూత్తుకుడి జిల్లాకు చెందిన రాజ్ కుమార్ అనే తంబి రాజా(60) అని, ఇతను ప్రముఖ రౌడీ అయిన రాకెట్ రాజా సహచరుడని తెలిసింది. పోలీసులు అతని వద్ద విచారణ చేస్తున్నారు.
దాడి కేసులో నలుగురి అరెస్ట్
తిరువొత్తియూరు: ఽదర్మపురి జిల్లా, మారాండహళ్లి గ్రామానికి చెందిన సెంథిల్(35) న్యాయవాదిగా ఉన్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన కన్నన్(40) అనే వ్యక్తికి భూమికి సంబంధించి తన పాత విరోధం ఉంది. ఈ క్రమంలో సెంథిల్ ఆదివారం తన ఇంటిలో ఉంచి తన రెండున్నర సంవత్సరాల కుమారుడుని పిలుచుకొని నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలో కన్నన్ అతని బంధువులు వెంకటేశ్(30), ఈశ్వరన్(29), సౌమ్య(38) అక్కడికి చేరుకుని సెంథిల్ కళ్లలో కారం పొడి చల్లి అతనిపై కత్తితో దాడి చేశారు. దీని అడ్డుకోవడానికి వచ్చిన సెంథిల్ తండ్రి పెరుమాళ్లు, పిన్ని అయిన లక్ష్మి పైన కూడా కత్తితో వారు దాడి చేసి తప్పించుకొని పారిపోయారు. గాయాల పాలైన సెంథిల్, పెరుమాళ్, లక్ష్మి తదితరులను స్థానికులు పాలక్కోడు ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. దీని గురించి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కన్నన్, వెంకటేష్, ఈశ్వరన్, సౌమ్యలను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వారి వద్ద విచారణ చేస్తున్నారు.
పట్టాల సమీపంలో శిశువు మృతదేహం
అన్నానగర్: చైన్నెలోని వ్యాసర్పాడి రామలింగ దేవాలయం సమీపంలోని రైలు పట్టాల వద్ద ఆదివారం సాయంత్రం గుడ్డలో చుట్టి మగ శిశువు మృతదేహాన్ని గుర్తించారు. రక్తపు మరకలతో ఉన్న పసిపాప చుట్టూ కుక్కలు మూగాయి. దీంతో దిగ్భ్రాంతి చెందిన ప్రజానీకం కుక్కలను తరిమి కొట్టి వ్యాసర్పాడి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మగ శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైనా అబార్షన్ చేసి పారేశారా లేక నెలరోజుల్లో పుట్టి చనిపోయి గుడ్డలో పడేశారా లేక ఎవరైనా రైలు ప్రయాణికులు నెలలు నిండని శిశువును రైలు నుండి పట్టాలపైకి విసిరారా అని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారి మృతిపై విచారణ
వేలూరు: తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి రైల్వే స్టేషన్ సమీపంలోని పుత్తుకోయిల్ ప్రాంతంలోని రైల్వై పట్టాలపై 16 సంవత్సరాల వయస్సు గల చిన్నారి మృత దేహం ఆదివారం ఉదయం రెండు భాగాలుగా కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రైల్వే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. అందులో ఆ చిన్నారి వాణియంబాడి సమీపంలోని అంబలూరు గ్రామానికి చెందిన జయరాఘవన్ కుమారుడు నరసింహన్(16)గా తెలిసింది. ఇతను పదో తరగతి వరకు పూర్తి చేసి ఇంటిలో ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. జోలార్‌పేట రైల్వే పోలీస్ సేషన్‌కు చేరుకొని తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, పట్టాలపై మృత దేహం రెండు భాగాలుగా ఉండడంతో ఎవరో హత్య చేసి పట్టాలపై వేశారని ఫిర్యాదు చేశారు. వీటిపై పోలీ సులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
నటుడు గోవిందరాజ్‌కు అంత్యక్రియలు
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని అప్పుకల్ చెరువు కుంట గ్రామానికి చెందిన గోవిందరాజ్(75) సినీ నటుడు. బారతీరాజా డైరెక్షన్‌లో కరుత్తమ్మా సినిమాలో పరిచయమయ్యాడు. సినీ నటుడు విజయకాంత్‌తో తవసి సినిమాలో, విజయ్‌తో పాటు అయగియ తమిళ్ మగన్ తదితర వందకు పైగా సినిమాల్లో నటించాడు. ఐదు సంవత్సరాల క్రితం ముందు సొంత గ్రామానికి చేరుకొని అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు అంత్యక్రియలు చేశారు. మృతి చెందిన గోవిందరాజ్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment