మానవత్వాన్ని మరింత పెంచుదాం
● వీసీఐ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ
కొరుక్కుపేట: మానవత్వాన్ని మరింతగా పెంచేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ (వీసీఐ) ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి502ఏ 12వ క్యాబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి చైన్నె అరుంబాక్కంలోని డిజి వైష్ణవ్ కళాశాల ఆడిటోరి యం వేదికగా మారింది. ముఖ్యఅతిథిగా ఎరుకుల రామకృష్ణ పాల్గొన్నారు. కొత్త క్యాబినెట్‌లో వాసవీ క్లబ్ నూతన జిల్లా గవర్నర్‌గా సీఎం రాజేష్, క్యాబినెట్ కార్యదర్శిగా బి.అనంత పద్మనాభం, క్యాబినెట్ ట్రెజరర్‌గా రత్న కుమార్‌లతో పదవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం వీసీఐ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు పర్యవేక్షణలో సాగింది. మాజీ జిల్లా గవర్నర్‌లు డాక్టర్ ఎంవీ నారాయణ గుప్తా, కేసీ మణికంఠ, నామా సతీష్, రేష్మి ఓలేటి, కుమరవేల్, కేకే త్రినాథ్‌కుమార్, అనిత రమేష్ బాబు, రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నా పదవీ ప్రమా ణం చేసిన కొత్త క్యాబినెట్ సభ్యులను అభినందించారు. ముందుగా లలిత సహస్రనామ పారాయణం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సభను ఉద్దేశించి ఎరుకుల రామకృష్ణ మాట్లాడుతూ ముందుగా కొత్త క్యాబినెట్‌లో పద వి ప్రమాణం చేసిన వారికి అభినందనలు తెలి యజేశారు. 2025 సంత్సరంలో చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాలను సభకు సుదీర్ఘంగా వినిపించారు. కోట్లాది రూపాయలను వెచ్చించి వాసవీ క్లబ్ చేస్తున్న సేవలు ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని వ్యాఖ్యానించారు. హ్యూమానిటీ, కమ్యూనిటీ ప్రధానంగా చేసుకుని ఈ ఏడాది సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ము ఖ్యంగా మానవత్వాన్ని మరింతగా చాటిచెప్పేలా సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సరస్వతి పథకం ద్వారా 2025లో పేద విద్యార్థులను దత్తత తీసుకుని చదివించాలని కోరారు. వాసవీ క్లబ్ వి502ఏ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సీఎం రాజేష్ సారథ్యంలో తమిళనాట విస్తృతంగా సేవ చేయాలని, మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment