పరుత్తిపట్టులో గ్రంథాలయం ప్రారంభం
ఆవడి పరుత్తిపట్టులో నూతన గ్రంథాలయం
తిరువళ్లూరు: ఆవడి సమీపంలోని పరుత్తిపట్టులో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రాష్ట మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ బుధవారం ఉదయం అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆవడిలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుంచి గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయంలో 6,200 మంది సభ్యులు, 62 వేల పుస్తకాలు వున్నాయి. ఇక్కడికి రోజున సరాసరి రెండు వందల మంది వస్తుంటారు. అయితే ప్రస్తుతం గ్రంథాలయం వున్న భవనం శిథిలావస్థకు చేరిన క్రమంలో కొత్త భవనాన్ని కేటాయించాలని ప్రజల నుంచి వినతులు వచ్చింది. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు కార్పొరేషన్ సమావేశంలో వినతులను వుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తీర్మానించారు. ఇందులో భాగంగానే పరుత్తిపట్టు పార్క్ వద్ద రెండతస్తుల భవనాన్ని కేటాయించి అక్కడ ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని మంత్రి నాజర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఇక్కడ కొత్తబుక్‌లు, చిన్నారుల కోసం గ్రంథాలయం, ఆన్‌లైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు. ప్రజలు నూతన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ అధికారి కవిత, మేయర్ ఉదయకుమార్, డిప్యూటీ మేయర్ సూర్యకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment