వేల్‌టెక్‌లో సౌత్‌జోన్ చెస్ పోటీలు
తిరువళ్లూరు: పురుషుల సౌత్‌జోన్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్‌టెక్ వర్సిటీలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వేల్‌టెక్ వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రంగరాజన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ విజేత తేజస్విని హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీలకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 89 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో విజేతలకు 11న బహుమతులు అందజేయనున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన తేజస్విని మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు చెడు మార్గంలో ప్రవేశించకుండా వుండడానికి చెస్ లాంటి క్రీడలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం. అయితే ప్రతి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. కాగా పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచే జట్టు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. వైస్‌చాన్స్‌లర్ రజత్‌గుప్తా, రిజిస్ట్రార్ కన్నన్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment