చైన్నె అంతటా పోస్టర్ల కలకలం
కొరుక్కుపేట: ఇకపై ఆ దుర్మార్గుడితో కలిసి పనిచేయను అని నగర వ్యాప్తంగా అంటించిన పోస్టర్లు నగరవాసుల్లో కలకలం రేపింది. పార్టీ పేరు గాని, వ్యక్తి పేరు గాని, సంస్థ పేరు కానీ పోస్టర్ అంటించిన సంస్థ పేరు గాని లేకుండానే వెలిసిన ఈ పోస్టర్లు ఉత్కంఠతకు దారితీసింది. ఈ పోస్టర్లను చూసిన ప్రజలు ఇందుకోసం ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరిని ఉద్దేశించి రాశారో తెలియలీకపోవడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. అనామకులు అంటించిన ఈ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం విశేషం.
సైబర్ నేరాల కేసులో
ఇద్దరి అరెస్ట్
– రూ.46.22 లక్షలు స్వాధీనం
తిరువళ్లూరు: ప్రజలకు ఫోన్ చేసి పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఆవడి క్రైమ్ పోలీసులు అరెస్టు చేవారు. వారి నుంచి రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమని నమ్మించిభ ఆందోళనకు గురి చేసి వారి బ్యాంకు ఖాతాల నుంచి లక్షల రూపాయలను కాజేస్తున్నట్టు ఆవడి పోలీసులకు మేరి జెనట్ డైసీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో బెదిరింపులకు దిగుతున్న వ్యక్తులు మహ్మద్ ఇలియాస్(36), సాధిక్‌బాషా(39)గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.46.22లక్షల నగదు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పూందమల్లి కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు.
లంచం కేసులో మున్సిపాలిటీ అధికారి అరెస్టు
సేలం: రామనాథపురం జిల్లా పరమకుడి కార్పొరేషన్ అనుమతి పొందిన ఇంజినీర్ భారతి కన్నన్ పని చేస్తున్నాడు. ఈయన తన వినియోగదారులకు కట్టి ఇవ్వడం కోసం పరమకుడిలో ఉన్న నాలుగు ఇళ్ల స్థలాలకు నిర్మాణ ప్లాన్ అనుమతి కోసం రూ. 76,850 గత వారం చెల్లించాడు. దీనికి సంబంధించిన మున్సిపాలిటీ పథక అధికారిగా విధులు నిర్వహిస్తున్న బర్గుణన్‌ను భారతి కన్నన్ కలిశారు. అప్పుడు ప్లాన్ అనుమతి కోసం ఒక ఇంటికి రూ. 5 వేలు వంతున నాలుగు ఇళ్లకు కలిపి రూ. 20 వేలు లంచంగా ఇవ్వాలని, లేకుండా ఇంటి నిర్మాణ ప్లాన్ ఇవ్వడం కుదరదని బర్గుణన్ తెలిపాడు. అది ఇష్టం లేక లంచ నిరోదక పోలీసులకు భారతి కన్నన్ విషయం తెలిపాడు. అనంతరం వారు ఇచ్చిన సూచన మేరకు గురువారం మళ్లీ ఆ కార్యాలయానికి వెళ్లిన భారతి కన్నన్ అక్కడ ఉన్న బర్గుణన్‌కు తన సెల్‌ఫోన్ ద్వారా రూ. 20 వేలు పంపించాడు. అప్పటికే అక్కడ దాగి ఉన్న లంచ నిరోదక అధికారులు సెల్‌ఫోన్‌తో పాటు బర్గుణన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment